
‘విద్రోహి’ చిత్ర ఫస్ట్ సాంగ్‌ను టాలీవుడ్ మాస్ యాక్షన్ దర్శకుడు వి వి వినాయక్ విడుదల చేశారు. రవి ప్రకాష్, శివకుమార్, చరిష్మా శ్రీకర్, సాయి ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
Tollywood mass action director VV Vinayak launched the first song of the film Vidrohi. Starring Ravi Prakash, Shiv Kumar, Charishma Srikar, and Sai in lead roles, this suspense crime thriller is set for release soon.
‘విద్రోహి’ సినిమాను విజ్జన వెంకట సుబ్రహ్మణ్యం నిర్మిస్తుండగా, వి ఎస్ వి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే హీరో శ్రికాంత్ ఫస్ట్ లుక్ విడుదల చేయగా మంచి స్పందన లభించింది. ఇప్పుడు సాంగ్ విడుదలతో ప్రమోషన్స్ వేగం పెంచారు.
సాంగ్ విడుదల సందర్భంగా వి వి వినాయక్ మాట్లాడుతూ, ‘‘విద్రోహి కథ బలంగా ఉంది. ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. రవి ప్రకాష్ మంచి ఆర్టిస్ట్, ఈ సినిమాలో ఆయన పాత్ర బాగుంటుందని నమ్ముతున్నాను’’ అన్నారు.
IBM Mega Music అధినేత పప్పుల కనక దుర్గారావు మాట్లాడుతూ, ‘‘సినిమాకు ఇండస్ట్రీ నుంచి వస్తున్న సపోర్ట్ మాకు ఉత్సాహాన్ని ఇస్తోంది. త్వరలోనే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాము’’ అన్నారు.
దర్శకుడు వి ఎస్ వి మాట్లాడుతూ, ‘‘ఫస్ట్ లుక్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. ఇప్పుడు వి వి వినాయక్ సాంగ్ విడుదల చేయడం మాకు గర్వంగా ఉంది. ప్రతి పాత్ర ప్రత్యేకంగా, కొత్త పాయింట్‌తో ఈ సినిమా రూపొందించాం. త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తాము’’ అని తెలిపారు.
ఈ చిత్రంలో రవి ప్రకాష్, శివకుమార్, చరిష్మా శ్రీకర్, సాయి, తాగుబోతు రమేష్, మధునందన్, కోటేశ్వరరావు, జబర్దస్త్ బాబీ తదితరులు నటించారు.
VV Vinayak, known for his mass action films in Tollywood, launched the first song of the film Vidrohi. Starring Ravi Prakash, Shiv Kumar, Charishma Srikar, and Sai in lead roles, this suspense crime thriller is gearing up for release soon.
Produced by Vizjan Venkata Subrahmanyam and directed by VSV, Vidrohi has already gained attention with its first look, unveiled earlier by actor Srikanth. With the release of the song, the makers have stepped up the promotional activities.
Speaking at the song launch, VV Vinayak said, “The story of Vidrohi is strong and will connect with the audience. Ravi Prakash is a talented actor, and I believe his role in this film will be appreciated.”
Pappula Kanaka Durga Rao, head of IBM Mega Music, added, “The support we are receiving from the industry is very encouraging. We are excited to bring Vidrohi to the audience soon.”
Director VSV said, “The first look received a tremendous response, and we are very happy that VV Vinayak launched our song. Every character in this film stands out, and we have made this thriller with a fresh concept. We will announce the release date shortly.”
The film features Ravi Prakash, Shiv Kumar, Charishma Srikar, Sai, Tagubothu Ramesh, Madhu Nandan, Koteshwar Rao, Jabardasth Bobby, and others in important roles.