మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణంలోని లైన్ గడ్డ ప్రాంతంలో విషాదం నెలకొంది. ఇంట్లో మోటార్ ద్వారా నీళ్ళు పడుతున్న క్రమంలో ఒక్కసారిగా విద్యుత్ షాట్ సర్క్యూట్ అవడంతో భార్య భర్తలు మృతి చెందారు. బొల్లంపెల్లి శ్రీనివాస్ (45), బొల్లంపెల్లి శశి దేవి (38) ల మృతితో కాలనీలో విషాదఛాయలు అలముకున్నాయి