విజయ్ దేవరకొండ–రష్మిక మందన్న అక్టోబర్ 3న నిశ్చితార్థం చేసుకున్నారని విజయ్ టీమ్ మీడియాకు వెల్లడించింది..Vijay Deverakonda

Image: Screenshot from ‘  :    //www.google.com   ” (used under fair use for reporting)      

విజయ్ దేవరకొండ–రష్మిక మందన్న అక్టోబర్ 3న నిశ్చితార్థం చేసుకున్నారని విజయ్ టీమ్ మీడియాకు వెల్లడించింది. ఈ ప్రకటనతో చాలా కాలంగా వస్తున్న ప్రేమ, డేటింగ్ వార్తలకు ముగింపు పడగా, త్వరలోనే వీరిద్దరి వివాహం జరుగుతోందనే స్పష్టత వచ్చింది. అభిమానులు, నెటిజన్లు కాబోయే జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

నిశ్చితార్థం జరిగిన తరువాత విజయ్ దేవరకొండ తన చిన్ననాటి విద్యాభ్యాసంతో అనుబంధమైన పుట్టపర్తికి వెళ్లాడు. చిన్నప్పుడు ఆయన సత్య సాయిబాబా హాస్టల్‌లో చదివిన విషయం తెలిసిందే. విజయ్ కుటుంబం కూడా పుట్టపర్తి సాయిబాబాపై విశ్వాసం ఉంచుతుంది. దీంతో నిశ్చితార్థం తరువాత సాయిబాబా సమాధి వద్దకు వెళ్లి ఆశీర్వాదం తీసుకున్నట్లు తెలుస్తోంది. అక్కడ ఆయన చదివిన స్కూల్‌ను కూడా సందర్శించినట్టు సమాచారం.

విజయ్ కారులో పుట్టపర్తికి చేరుకున్న వీడియోను ఆయన పీఆర్వో సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ వీడియోలో రష్మిక కనిపించకపోవడంతో ఆమె వెళ్లలేదా అని అభిమానులు, నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

Vijay Deverakonda and Rashmika Mandanna were engaged on October 3, as officially confirmed by Vijay’s team to the media. The announcement ended long-standing speculation about their relationship and confirmed that their wedding is likely to take place soon. Fans and netizens have been congratulating the couple.

After the engagement, Vijay visited Puttaparthi, a place connected to his childhood education. He studied at the Sri Sathya Sai Baba hostel during his early years, and his family is known to be followers of Sai Baba. Reports suggest that Vijay went to the Sai Baba samadhi to seek blessings and also visited his old school.

A video shared by his PRO on social media showed Vijay stepping out of a car in Puttaparthi. Rashmika was not seen in the visuals, leading fans and netizens to question whether she accompanied him or not.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *