విఆర్ స్కూల్‌ను మళ్లీ తెరిపించాం – విద్యాభివృద్ధికి పట్టుదలతో ముందుకు వెళ్తున్నాం: మంత్రి నారాయణ

విఆర్ స్కూల్‌ను మళ్లీ తెరిపించాం – విద్యాభివృద్ధికి పట్టుదలతో ముందుకు వెళ్తున్నాం: మంత్రి నారాయణ
VR School Reopened – Committed to Educational Development: Minister Narayana

నెల్లూరులో విఆర్ స్కూల్ పునఃప్రారంభ కార్యక్రమంలో మంత్రులు నారాయణ, లోకేష్, ఆనం తదితర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. 1850లో హిందూ స్కూల్‌గా ప్రారంభమైన ఈ పాఠశాల తిరిగి విద్యార్థుల ఒరవడిని చూచేలా అభివృద్ధి చేయబడింది.
At the VR School reopening ceremony in Nellore, Ministers Narayana, Lokesh, Anam and other representatives participated. Originally established in 1850 as a Hindu School, the institution has now been revived for new generations of students.

ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ తాను ఇదే స్కూల్‌లో విద్యార్థిగా చదివి, ఆ తర్వాత ఉపాధ్యాయుడిగా పనిచేశానని గుర్తు చేశారు. గత ప్రభుత్వ కాలంలో ఆర్థిక పరిస్థితి దిగజారడం వల్ల స్కూల్ మూతపడినట్లు చెప్పారు.
Minister Narayana recalled his personal connection to VR School, stating that he studied and later served as a teacher there. He blamed the previous government for the school’s closure due to mismanagement of state finances.

ప్రధానమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిపాదించిన P4 విధానం కింద రాష్ట్ర అభివృద్ధి జరగాలనే సంకల్పంతో తన కుమార్తె షరిణి విఆర్ స్కూల్ పునరుద్ధరణకు ముందుకొచ్చిందని తెలిపారు. డీఎస్ఆర్ కాంట్రాక్టర్ ద్వారా మూలాపేటలోని పాఠశాల‌ను అభివృద్ధి చేసినట్లు వివరించారు.
He shared that under the vision of CM Chandrababu Naidu’s P4 policy, his daughter Sharini took the initiative to revive the school. DSR contractors worked to upgrade the Mulapeta branch as part of this mission.

విపిఆర్ సంస్థ కూడా ఈ అభివృద్ధిని చూసి మరికొన్ని పాఠశాలలను అభివృద్ధి చేయాలని ముందుకొచ్చిందని వెల్లడించారు. చివరగా తనను ఎమ్మెల్యేగా గెలిపించడమే ఈ అభివృద్ధికి వీలు కల్పించిందని ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.
VPR Group was inspired by the changes and pledged to support the development of more schools. Concluding his speech, Narayana thanked voters, stating that his MLA victory made this progress possible.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *