వలసదారులకు సేవలందించేందుకు మొబైల్ సహాయ కేంద్రం ప్రారంభం – మంత్రి తుమ్మలMobile Migration Resource Centre Launched to Support Migrant Families in Telangana – Minister Tummala

వలసదారులకు సేవలందించేందుకు మొబైల్ సహాయ కేంద్రం ప్రారంభం – మంత్రి తుమ్మల
Mobile Migration Resource Centre Launched to Support Migrant Families in Telangana – Minister Tummala

తెలంగాణలో వలస కుటుంబాలకు సమాచారం, శిక్షణ, పశుసేవలందించే మొబైల్ వలస సహాయ కేంద్రాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. IOM, FAO భాగస్వామ్యంతో ఈ కేంద్రం గ్రామీణ వలసదారులకు సేవలందించనుంది.

తెలంగాణ రాష్ట్రంలో వలసదారుల సంక్షేమం కోసం ఒక కీలక చర్యగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు “మొబైల్ వలస సహాయ కేంద్రాన్ని” (m-MRC) హైదరాబాద్‌లో ప్రారంభించారు. ఐక్యరాజ్యసమితి వలస సంస్థ (IOM) మరియు FAO సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించాయి. దీనివల్ల నిజామాబాద్, నారాయణపేట జిల్లాల్లో వలస వెళ్లే గ్రామీణ కుటుంబాలకు వలసకు ముందు, వలస సమయంలో, తిరిగి వచ్చిన తర్వాత అవసరమైన సమాచారం, మార్గదర్శకత, శిక్షణలతో పాటు పశుసేవలు అందించబడతాయి.

ఈ ప్రారంభ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ డైరెక్టర్ డా. బి.గోపీ, FAO అగ్రిబిజినెస్ స్పెషలిస్ట్ జగన్మోహన్ రెడ్డి, IOM రాష్ట్ర సమన్వయకర్త జలజ, NWWT అధ్యక్షురాలు సిస్టర్ లిస్సీ జోసఫ్, ఇతర అధికారులు పాల్గొన్నారు. డా. గోపీ మాట్లాడుతూ జిల్లాల స్థాయి అధికారులతో సమన్వయం ద్వారా శిక్షణలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ – “ఈ వాహనాన్ని పూర్తిస్థాయిలో వినియోగించి, ఎంపికచేసిన ప్రాంతాల రైతులకు మట్టి పరీక్షలు, సేంద్రీయ వ్యవసాయ విధానాలు, పశుపాలనపై వర్చువల్ శిక్షణలు ఇవ్వాలి” అని సూచించారు. మొబైల్ వాహనాల ద్వారా మట్టి నమూనాల పరీక్షలు, ఇతర సేవలు కూడా అందించవచ్చని ఆయన తెలిపారు. వలస వెళ్ళిన కుటుంబాల్లో మిగిలిపోయే మహిళలకు గ్రామస్థాయిలో సేవలందించడం ద్వారా ఈ వాహనం శక్తివంతమైన సాధనంగా నిలుస్తుందని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *