వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలిజిల్లా డిసిసి అధ్యక్షులు అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌…


జగిత్యాల : వరి కొనుగోలు కేంద్రాలను త్వరితగతిన ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని జగిత్యాల జిల్లా డిసిసి అధ్యక్షులు ,మాజీ జడ్పీచైర్మన్‌ అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ ఆన్నారు..శుక్రవారంజిల్లా లోని గొల్లపెల్లి మండల కేంద్రంలోని మార్కెట్‌ యార్డు ను జగిత్యాల జిల్లా డిసిసి అధ్యక్షులు ,మాజీ జడ్పీచైర్మన్‌ అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ సందర్శించారు…ఈ సందర్భంగా వర్షాలకు తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు.ఆనంతరం రైతులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు..ఈ సందర్భంగా అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ మాట్లాడుతూఒక రాష్ట్ర క్యాబినెట్‌ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజక వర్గంలో రైతులకు మేలు చేసే విధంగా మార్కెట్‌ యార్డు అధికారులు, ప్రజా ప్రతినిధులు పాలకవర్గం ఉండాలన్నారు.రైతులు కష్టపడి పంటను పండిరచి ఆ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల వద్దకు తీసుకువచ్చి దాదాపు నెల రోజులు గడుస్తున్న ఇప్పటి వరకు కొనుగోలు ప్రక్రియ మొదలు కాలేదని,మార్కెట్‌ యార్డ్‌ లో పరిస్థితే ఈ విధంగా ఉంటే ఇక గ్రామాల్లో ఉన్న ఐకెపి సెంటర్ల పరిస్థితి ఏ విధంగా ఉందో ఊహించుకోవచ్చని ఆన్నారు..కాంగ్రెస్‌ పార్టీ హయాంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ ప్రారంభించడానికి ముందు జిల్లా కలెక్టర్‌, అధికారులు, ప్రజాప్రతినిధులతో జిల్లా మంత్రి ఒక రివ్యూ విూటింగ్‌ ఏర్పాటు చేసే వారని,మిల్లర్ల తో జిల్లా కలెక్టర్‌ గారే నేరుగా మాట్లాడి వడ్ల కొనుగోళ్ల విషయంలో స్పష్టమైన ఆదేశాలు జారీ చేసే వారన్నారు. ప్రస్తుతం రైతులు కష్టపడి పండిరచిన పంట నుండి మిల్లర్లు మూడు నుండి నాలుగు కిలోలు తాలు తప్ప పేరిట కటింగ్‌ చేస్తున్నారని,అకాల వర్షాలతో కొనుగోలు కేంద్రాల వద్ద ఆరబోసిన వడ్లు తడిసి మొలకలు వస్తే ఇక్కడికి మంత్రి కొప్పుల ఈశ్వర్‌ గాని, ప్రజా ప్రతినిధులు గాని, అధికారులు గాని వచ్చి రైతుల పరిస్థితి గురించి అడిగి తెలుసుకో లేదని,ఇప్పటికైనా మంత్రి కొప్పుల ఈశ్వర్‌ స్పందించి నాలుగు రోజుల లోపల ఈ వడ్ల కొనుగోళ్ల సమస్యను పరిష్కరించకపోతే రైతుల పక్షాన పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు..ఈ కార్యక్రమంలో గొల్లపెల్లి మండల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు ముస్కు నిశాంత్‌ రెడ్డి,సర్పంచ్‌ లు చిర్ర గంగాధర్‌, రేవల్ల సత్య నారాయణ, ఎంపీటీసీ లక్ష్మణ్‌ ,రైతులు తదితరులు పాల్గొన్నార

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *