వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ పర్యటించి నష్టాలను పరిశీలించారు.CM Revanth toured flood-affected areas and reviewed the damage.

వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ పర్యటించి నష్టాలను పరిశీలించారు.
CM Revanth toured flood-affected areas and reviewed the damage.

కామారెడ్డి జిల్లాలోని తాడ్వాయి మండలం ఎర్రపహాడ్‌లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. ఈ పర్యటనలో మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన సీఎం, బ్రిడ్జ్ పరిస్థితిపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను కూడా సందర్శించారు. తాత్కాలిక మరమ్మతులతో కాకుండా, బ్రిడ్జ్ నిర్మాణానికి పూర్తి స్థాయి ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు రాకుండా బ్రిడ్జ్ కమ్ బ్యారేజ్ లేదా బ్రిడ్జ్ కమ్ చెక్ డ్యామ్ నిర్మాణ సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని సూచించారు. పూర్తి అంచనాలతో ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. అనంతరం లింగంపేట మండలం బుడిగిద్దలో భారీ వర్షాల వల్ల నష్టపోయిన పంటలను పరిశీలించారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. త్వరగా నష్టం వివరాలు నమోదు చేసి సహాయం అందిస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

CM Revanth Reddy visited Errapahad in Tadwai mandal, Kamareddy district. Ministers Seethakka, Ponguleti Srinivas Reddy, PCC chief Mahesh Kumar Goud, MLA Madan Mohan Rao and others accompanied him. The CM reviewed flood-affected areas and observed a photo exhibition on the condition of the bridge. He directed officials to prepare a comprehensive plan for bridge construction instead of temporary repairs.

He further suggested examining the feasibility of constructing a bridge-cum-barrage or bridge-cum-check dam to prevent such issues in the future. Officials were instructed to prepare proposals with complete assessments. Later, at Budigidda in Lingampet mandal, the CM inspected crop damage caused by heavy rains. He assured that the government would fully support farmers affected by untimely rains and promised immediate relief after recording the damage.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *