వనపర్తి జిల్లాలో నేరాల దర్యాప్తును మరింత వేగవంతం చేసేందుకు ట్రాకర్ డాగ్ ‘మాయ’ పోలీస్ డాగ్ స్క్వాడ్‌లో చేరగా, 8 నెలల ప్రత్యేక శిక్షణ పూర్తి చేసి ఫీల్డ్ విధులకు సిద్ధమైంది.

To strengthen crime detection, tracker dog ‘Maya’ has joined the Wanaparthy police dog squad after completing eight months of intensive training.

వనపర్తి జిల్లాలో నేరాల దర్యాప్తును మరింత వేగవంతం చేసేందుకు ట్రాకర్ డాగ్ ‘మాయ’ పోలీస్ డాగ్ స్క్వాడ్‌లో చేరగా, 8 నెలల ప్రత్యేక శిక్షణ పూర్తి చేసి ఫీల్డ్ విధులకు సిద్ధమైంది. To strengthen crime detection, tracker dog ‘Maya’ has joined the Wanaparthy police dog squad after completing eight months of intensive training.

వనపర్తి జిల్లాలో నేర చేదనకు సాంకేతికతతో పాటు శునక దళాన్ని మరింత బలోపేతం చేస్తూ ట్రాకర్ శునకం ‘మాయ’ తాజాగా పోలీసు విభాగంలో చేరింది. జిల్లా ఎస్పీ Sunitha Reddy వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ ట్రాకర్ శునకం దొంగతనాలు, హత్యలు వంటి కీలక కేసుల దర్యాప్తులో ఆధారాల గుర్తింపులో ప్రత్యేకంగా ఉపయోగపడనుంది.

8 నెలలపాటు కఠిన శిక్షణను పూర్తి చేసిన ‘మాయ’ ఫీల్డ్ విధులకు పూర్తిగా సిద్ధమైంది. డాగ్ హాండ్లర్ కానిస్టేబుల్ దేవ్యానాయక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీని కలసి శిక్షణ వివరాలను తెలియజేశారు. హైదరాబాద్ సమీపంలోని మోహినాబాద్ పోలీస్ డాగ్ ట్రైనింగ్ సెంటర్‌లో నిర్వహించిన శిక్షణలో అనుమానాస్పద వస్తువుల గుర్తింపు, నేరస్థుల అడుగుజాడలను పసిగట్టడం, క్లిష్ట పరిస్థితుల్లో సమర్థవంతంగా పనిచేయడం వంటి అంశాల్లో ‘మాయ’ ప్రావీణ్యం సాధించింది.

ఎస్పీ మాట్లాడుతూ, నేరాలను కేవలం విచారణతోనే కాదు, స్పష్టమైన ఆధారాలతో చేదించాల్సిన అవసరం ఉందని, ఈ ప్రక్రియలో ట్రాకర్ శునకాలు కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు. నేరస్థలంలో సూక్ష్మ ఆధారాలను గుర్తించి దర్యాప్తుకు దిశానిర్దేశం ఇవ్వడంలో ‘మాయ’ సమర్థవంతంగా పనిచేస్తుందని తెలిపారు.

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, సీసీటీవీ నిఘా వ్యవస్థలతో పాటు శునక దళం సేవలను సమన్వయంతో వినియోగించి జిల్లాలో శాంతిభద్రతలను మరింత బలోపేతం చేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు కూడా అనుమానాస్పద వ్యక్తులు లేదా సంఘటనలపై వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.

With the induction of tracker dog ‘Maya’, the police department in Wanaparthy aims to enhance evidence-based investigation and improve response in theft and murder cases. Officials said the trained dog will help trace suspects quickly and strengthen overall law and order. The department plans to integrate dog squad services with surveillance technology for effective policing.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *