వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్‌తోపాటు పాలు అందించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయం ద్వారా విద్యార్థుల పోషకాహార స్థాయి మెరుగుపడటంతో పాటు ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి దోహదం అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

From the next academic year, the Telangana government will provide milk along with breakfast to students of government schools, aiming to improve nutrition and strengthen public education.

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసే దిశగా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. పాఠశాలల్లో మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడం, నాణ్యమైన విద్య అందించడం ద్వారా విద్యార్థుల నమోదు సంఖ్యను పెంచే లక్ష్యంతో అధికారులు చర్యలు చేపట్టారు. అదే సమయంలో విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పౌష్టికాహారంపై ప్రత్యేక దృష్టి సారించారు.

రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి 1 నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు అల్పాహారంతో పాటు ఒక గ్లాసు పాలు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో Revanth Reddy అధికారులకు దిశానిర్దేశం చేసినట్టు సమాచారం. పాలు సరఫరా కోసం Vijaya Dairy నుంచి సేకరణ జరిపేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. అధికార యంత్రాంగం ఇప్పటికే కార్యాచరణ ప్రారంభించింది.

ప్రస్తుతం తెలంగాణలో సుమారు 29 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారు. జాతీయ పోషకాహార ప్రమాణాల మేరకు ప్రతి విద్యార్థికి అల్పాహార సమయంలో ఒక గ్లాసు పాలు అందించాలనే లక్ష్యంతో ప్రణాళిక రూపొందించారు. ఈ లెక్కన రోజుకు సుమారు 3 నుంచి 4 లక్షల లీటర్ల పాలు అవసరమవుతాయని అంచనా వేస్తున్నారు.

డెయిరీ అధికారులు విద్యార్థులకు పాలు సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. రైతుల నుంచి రోజువారీగా సేకరించే సుమారు 4 లక్షల లీటర్ల పాలు పాఠశాలలు, అంగన్‌వాడీ విద్యార్థుల అవసరాలు తీర్చడమే కాకుండా పాడి ఉత్పత్తులకు కూడా సరిపోతాయని పేర్కొన్నారు. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే విద్యార్థుల ఆరోగ్యానికి మేలు కలగడమే కాకుండా పాడి పరిశ్రమ అభివృద్ధికి, రైతుల ఆదాయానికి కూడా తోడ్పాటు లభించే అవకాశముంది.

The Telangana government has taken a key step to strengthen public schools by focusing on both infrastructure and student welfare. From the upcoming academic year, students from Classes 1 to 12 in government schools will receive a glass of milk along with breakfast.

Following directions from Chief Minister Revanth Reddy, officials have initiated arrangements to procure milk from Vijaya Dairy. With around 29 lakh students enrolled in government schools across the state, the administration estimates a daily requirement of nearly 3 to 4 lakh litres of milk, in line with national nutritional norms.

Dairy authorities have expressed readiness to supply the required quantity. They stated that nearly 4 lakh litres of milk collected daily from farmers would be sufficient to meet the needs of school and anganwadi students while also supporting dairy-based products. The move is expected to enhance students’ nutritional standards and simultaneously benefit dairy farmers and the rural economy.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *