వందే భారత్‌ రైలును ప్రారంభించిన ప్రధాని మోడీ… బండి సంజయ్ పై అమితమైన ప్రేముందని చెప్పకనే చెబుతున్న ప్రధాని మోడీ…


శనివారం హైదరాబాద్‌ పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీకి విమానాశ్రయంలో మంత్రి తలసాని, ఎంపీలు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆయన మొదటటగా సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ చేరుకొని, వందే భారత్ రైలు ఎక్కి అక్కడున్న విద్యార్దులతో కొంతసేపు మాట్లాడారు అనంతరం వందేభారత్‌ రైలును జెండా ఊపి ప్రారంభించారు. సికింద్రాబాద్‌ తిరుపతి మధ్య ప్రయాణించే ఈ రైల్లో మొత్తం 530 మంది ప్రయాణికులకు సరిపడా సీట్లు ఉంటాయి. సికింద్రాబాద్లో ఉదయం బయల్దేరి మధ్యాహ్నానికి తిరుపతి చేరుకుంటుంది. ఈ రైలు వారానికి ఆరు రోజులు నడవనుంది.మంగళవారం సర్వీసు వుండదు. అయితే తొలి రోజు సాధారణ ప్రయాణికులను అనుమతించారు.ఈ రైలు ఏప్రిల్‌ 9వ తేదీ నుంచి రైలు ప్రయాణికులకు అందుబాటులోకి వస్తుంది.

తెలంగాణ పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ పలు అభివృద్ధి పనులకు సైతం శ్రీకారం చుట్టారు. వందే భారత్‌ ట్రైన్‌ను ప్రారంభించిన అనంతరం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన సభలో ఆయన పాల్గొని సభా వేదికగా.. రిమోట్ ద్వారా పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. తెలంగాణ లోనే అతిపెద్ద సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఆధునీకరణ పనులతో పాటుగా, పలు జాతీయ రహదారుల నిర్మాణం, బీబీ నగర్ ఎయిమ్స్ భవన నిర్మాణం, మహబూబ్ నగర్- చించోలి మార్గాన్ని 2 ప్యాకేజీలుగా విస్తరణ, ఖమ్మం – దేవరపల్లి రహదారిని 4 వరుసలతో గ్రీన్‌పీల్డ్ కారిడార్‌గా నిర్మాణం, MMTS రెండో దశలో భాగంగా 13 ట్రైన్స్ ప్రధాని మోదీ వర్చువల్‌గా రిమోట్ తో ప్రారంభించారు.

అనంతరం సభలో ప్రసంగించిన ప్రధాని మోడీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం ఇవ్వటం లేదనన్నారు. ముందుగా సభలో ‘ప్రియమైన సోదర, సోదరీమణులారా..’ అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించి తెలుగు వారి మనసు గెలుచుకునే ప్రయత్నం చేసారు. రాష్ట్రంలో ఇవాళ రూ. 11 వేల కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభించినట్లుగా చెప్పారు. హైదరాబాద్‌లో ఇవాళ ఒకే రోజు 13 ఎంఎంటీఎస్ రైళ్లను ప్రారంభించామన్నారు. దేశ అభివృద్ధిలో తెలంగాణ భాగమయ్యేలా చేశామని చెప్పుకొచ్చారు. అయితే కేంద్రం నుంచి ప్రాజెక్టులు వస్తున్నా.. రాష్ట్ర ప్రభుత్వం సహకరించట్లేదఅంటూ ఈ సందర్భంగా ప్రధాని రాష్ట్ర ప్రభుత్వం పై విమర్శలు ఎక్కుపెట్టారు.

నాపై పోరాటానికి అన్ని శక్తులు ఏకమయ్యాయి
ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడమే మా లక్ష్యం
అన్ని విషయాల్లో తమ కుటుంబ స్వార్ధం చూసుకుంటున్నారు
ఇలాంటి వారితో తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
వారసత్వ రాజకీయంతో అవినీతిని పెంచి పోషిస్తున్నారు
ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడమే మా లక్ష్యం
రాష్ట్రాభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వం రాలేదు.
దేశాన్ని అవినీతి నుంచి విముక్తి చేయాలా వద్దా?
అవినీతిపరులపై పోరాటం చేయాలా?.. వద్దా?
అవినీతిపరులపై చట్టప్రకారం చర్యలు చేపట్టాలా.. వద్దా?
వారసత్వ రాజకీయాల్లో భాగంగా పేదల రేషన్‌ కూలా లాక్కున్నారు
80 కోట్ల మందికి నేడు ఉచితంగా రేషన్‌ అందిస్తున్నాం
సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో జరిగిన బహిరంగ సభ లో ప్రదాని మోడీ
కేసీఆర్‌ సర్కార్‌పై మాట్లాడుతారని ముందే ఊహించిన బీజేపీ శ్రేణులు

అన్ని విషయాల్లో తమ కుటుంబ స్వార్ధం చూసుకుంటున్నారు ఇలాంటి వారితో తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రధాన మంత్రి నరేంద్రమోడి తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్‌ పై నిప్పులు చెరిగారు. సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో జరిగిన బహిరంగ సభ లో ప్రదాని తెలుగులో ప్రసంగం ప్రారంభించి ప్రసంగించారు.వారసత్వ రాజకీయంతో అవినీతిని పెంచి పోషిస్తున్నారని కాని ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడమే మా లక్ష్యమన్నారు.తెలంగాణ ప్రభుత్వం కేంద్రంతో కలిసి రావడం లేదు,అందుకే అభివృద్ధి పనుల్లో ఆలస్యం జరుగుతోంది.ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం మా లక్ష్యం..కానీ కొందరు అభివృద్ధిని కావాలని అడ్డుకుంటున్నారురాష్ట్రంలో కుటుంబం పాలన, అవినీతిని పెంచిపోషిస్తున్నారునిజాయితీగా పనిచేసేవారంటే వారికి నచ్చడం లేదుతెలంగాణలో కుటుంబపాలనతో అవినీతి పెరిగిందికొందరి గుప్పెట్లోనే అధికారం మగ్గుతోందిరాష్ట్రంలో కొంతమంది ప్రగతి నిరోధకులుగా మారారుప్రజల సొమ్ము అవినీతిపరులకు చేరకుండా చర్యలు చేపట్టాంనేరుగా రైతులు, విద్యార్థుల ఖాతాల్లోనే నిధులు వేస్తున్నామని చెప్పారు.కుటుంబవాదంతో ప్రతీ వ్యవస్థను తమ అదుపులో పెట్టుకోవాలనుకున్నారువారి నియంత్రణను ఎవరు సవాల్‌ చేయకూడదనుకుంటారు డిజిటల్‌ పేమెంట్స్‌ ద్వారా దళారీ వ్యవస్థ లేకుండా చేశాం రాష్ట్రాభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వం రాలేదు.దేశాన్ని అవినీతి నుంచి విముక్తి చేయాలా వద్దా?అవినీతిపరులపై పోరాటం చేయాలా?.. వద్దా?అవినీతిపరులపై చట్టప్రకారం చర్యలు చేపట్టాలా.. వద్దా?నాపై పోరాటానికి అన్ని శక్తులు ఏకమయ్యాయి ప్రధాని మోదీకోర్టుకు వెళ్లారు.. అక్కడా వారికి షాక్‌ తగిలింది..వారసత్వ రాజకీయాల్లో భాగంగా పేదల రేషన్‌ కూలా లాక్కున్నారు80 కోట్ల మందికి నేడు ఉచితంగా రేషన్‌ అందిస్తున్నాం
తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం..
కేంద్రం తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉంది: ప్రధాని మోదీఒకే రోజు 13 ఓఓుూ రైళ్లను ప్రారంభించాం. దేశాభివృద్ధిలో తెలంగాణ భాగమయ్యేలా చూశాంహైదరాబాద్‌బెంగళూరు అనుసంధాన్ని మెరుగుపరుస్తున్నాంమౌలిక వసతుల కోసం రూ.10 లక్షల కోట్లు కేటాయించా మన్నారు.తెలంగాణలో నాలుగు హైవేలకు శ్రీకారం చుట్టాంకల్వకుర్తి కొల్లాపూర్‌, మహబూబ్‌నగర్‌` చించోలి రోడ్డు విస్తరణ పనులుహైదరాబాద్‌ రింగ్‌రోడ్డు ప్రాజెక్టు కూడా అమల్లో ఉందిపరిశ్రమలు, వ్యవసాయ అభివృద్ధికి కేంద్రం చేయూత ఇస్తోందిదేశవ్యాప్తంగా 7 మెగా టెక్స్‌టైల్స్‌ పార్కులు ఏర్పాటు చేస్తున్నాము. తెలంగాణలో కూడా మెగా టెక్స్‌టైల్స్‌ పార్కు ఏర్పాటు చేస్తాం.ప్రసంగంలో భాగ్యలక్ష్మి ఆలయాన్ని ప్రస్తావించిన ప్రధాని,ఇంతవరకూ ఏ ప్రసంగంలోనూ ఆలయం ప్రస్తావన తీసుకురాని మోదీసడన్‌గా మోదీ ఈ ప్రస్తావన తీసుకురావడంతో సర్వత్రా చర్చ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *