మహారాష్ట్రలోని రాయగఢ్ జిల్లాలో శనివారం ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు బస్సు లోయలో పడిన ఘటనలో ఎనిమిది మంది మృతి చెందారు. మరో .25 మందికి పైగా గాయపడ్డారని పోలీసులు వెల్లడిరచారు. పూణేలోని పింపుల్ గురవ్ నుంచి గోరెగావ్కు బస్సు వెళ్తుండగా పూణె`రాయ్గఢ్ సరిహద్దులో తెల్లవారుజామున 4:30 గంటలకు ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. క్షతగాత్రులను సవిూపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.