లీకేజీల వ్యవహారాలను అరికట్టడంలో బీఆర్‌ఎస్‌ సర్కార్‌ సక్సెస్‌ అయ్యిందా..?


తెలంగాణలో ప్రకంపనలు రేపిన వరుస పేపర్‌ లీకేజీల వ్యవహారాలను అరికట్టడంలో బీఆర్‌ఎస్‌ సర్కార్‌ సక్సెస్‌ అయ్యిందా..? టీఎస్‌పీఎస్సీ పేపర్లు మొదలుకుని నిన్న, మొన్నటి టెన్త్‌ పేపర్ల లీకేజీల వరకూ బీజేపీ హస్తముందని పదే పదే ఆరోపించడం, ఆ తర్వాత అరెస్ట్‌ లు చేయడంలో ఆంతర్యమేంటి..? అసలు ఈ పేపర్‌ లీకేజీల గురించి ఎవరు ఆరోపణలు చేసినా సరే వెనువెంటనే నోటీసులు ఇవ్వడమేంటి..? ప్రతిపక్షాలైన బీజేపీ కాంగ్రెస్‌ పార్టీలను ఉక్కిరి బిక్కిరి చేయడంలో భాగంగానే గులాబీ బాస్‌ ఇలా చేశారా..? ఇదంతా పక్కా వ్యూహంతోనే ఎన్నికల వ్యూహకర్త చేయిస్తున్నారా..? అసలు ఈ పేపర్‌ లీకేజీ ఎపిసోడ్‌లపై బీజేపీ, కాంగ్రెస్‌ ఏమనుకుంటోంది..? బీఆర్‌ఎస్‌ ఎలా ఫీలవుతోంది..? ఈ మొత్తవ్మిూద ఈ ఘటనలను

దేశంలో మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో చీమ చిటుక్కుమన్నా సరే అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతుంటాయ్‌. ఏదైనా విషయంపై అటు అధికార పార్టీ అయినా.. ఇటు ప్రతిపక్ష పార్టీల నేతలు విూడియా ముందుకొచ్చారంటే ఇక కౌంటర్లే.. కౌంటర్లు. ఇక తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ కానీ.. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి కానీ విూడియా ముందుకొచ్చారో అధికార పార్టీ తరఫున ఎంత మంది ప్రెస్‌విూట్స్‌ పెడతారో లెక్కే ఉండదు. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణలో జరిగిన పేపర్‌ లీకేజీలో బీజేపీ హస్తం ఉందని తెలిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. సరిగ్గా ఇలాంటి పరిస్థితే తెలంగాణలో చోటుచేసుకుంది. టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీ వ్యవహారంలో బీజేపీ కార్యకర్త హస్తం ఉందని.. మొత్తం చేసింది అతడేనని బీఆర్‌ఎస్‌ మొదట్నుంచీ ఆరోపిస్తూ వస్తోంది. ఇటు బీఆర్‌ఎస్‌ కార్యకర్త పనే అంటూ ఫొటోలతో సహా బీజేపీ రిలీజ్‌ చేసింది. దీంతో పేపర్‌ లీకేజీ కాస్త పొలిటికల్‌ లీకేజీగా మారిపోయింది. ఆ తర్వాత వరుస అరెస్ట్‌లు, నోటీసులతో అటు సిట్‌ (ఇటు ఈడీ ఒక్కసారిగా దూకుడు పెంచడంతో మొత్తం 17 మందిని అదుపులోనికి తీసుకున్నారు. మరోవైపు ఈ లీకేజీకి సంబంధించి రోజుకో సంచలన విషయం వెలుగులోకి వస్తోంది. ఈ వ్యవహారం ఇంకా కొలిక్కి రాకముందే.. పదో తరగతి క్వశ్చన్‌ లీక్‌ అయ్యింది. దీంతో ఒక్కసారిగా తెలంగాణలో పొలిటికల్‌ హీట్‌ పెరిగిపోయింది. అది కాస్త రచ్చ రచ్చగా మారింది. సీన్‌ కట్‌ చేస్తే.. ఇదంతా బండి సంజయ్‌) అరెస్ట్‌ దాకా వెళ్లింది. సంజయ్‌ను అరెస్ట్‌ చేసిన టైమ్‌లో ఎంత సీన్‌ జరిగిందో విూడియాలో అందరూ చూసే ఉంటారు.పేపర్‌ లీకేజీ వ్యవహారాల్లో ఎక్కడికక్కడ నిందితులను అరెస్ట్‌ చేయడంలో సీఎం కేసీఆర్‌ గ్రాండ్‌ సక్సెస్‌ అయ్యారని బీఆర్‌ఎస్‌ శ్రేణులు సంబరపడిపోతున్నాయి. సోషల్‌ విూడియా వేదికగాఎక్కడ చూసినా ఇవే పోస్టులు. లీకుల కథలో ఎంతటివారినైనా సరే కేసీఆర్‌ సర్కార్‌ తొక్కిపట్టి నారతీసిందని వీరాభిమానులు తెగ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా ఢల్లీి వేదికగా బీజేపీ చేయిస్తున్నదని జనాల్లోకి ఓ రేంజ్‌లో తీసుకెళ్లింది బీఆర్‌ఎస్‌. ఇదే టైమ్‌లో టెన్త్‌ పేపర్‌ లీకేజీలో బండి సంజయ్‌ హస్తం ఉందని ఏకంగా అరెస్ట్‌ చేయడంతో అసలు ఇదంతా ఎవరు చేస్తున్నారు.. ఏంటనేది అర్థం కాని పరిస్థితి. అయితే ఇదంతా బీజేపీనే చేయిస్తోందని.. ఇందులో ప్రతిచోటా బీజేపీ హస్తం ఉందని జనాల్లోకి తీసుకెళ్లడంలో మాత్రం బీఆర్‌ఎస్‌ మాత్రం సక్సెస్‌ అయ్యిందని పార్టీ శ్రేణులు చెప్పుకుంటున్నాయి. ఎన్నికలకు సమయం కూడా ఆసన్నం అవుతుండటంతో సరిగ్గా బీజేపీ దొరికింది కదా అని కమలనాథులను కక్ష్యగట్టి మరీ కేసీఆర్‌ ఉక్కిరి బిక్కిరి చేశారనే ఆరోపణలు లేకపోలేదు. అంతేకాదు బండి సంజయ్‌ తర్వాత చాలా మంది బీజేపీకి చెందిన నేతలను అరెస్ట్‌ చేయడం, నోటీసులు ఇవ్వడంతో మరింత పొలిటికల్‌ హీట్‌ పెరిగిపోయింది. బీజేపీ మాత్రం ఇదంతా బీఆర్‌ఎస్‌ తమకు ఎన్నడూ లేనంతగా మైలేజ్‌ ఇస్తోందని చెప్పుకుంటోంది. కేసీఆర్‌ పతనం ప్రారంభం అయ్యింది కాబట్టే ఇలా వ్యవహరిస్తున్నారని గల్లీ నుంచి ఢల్లీి వరకూ బీజేపీ మార్మోగిస్తోంది. ఇవన్నీ తమకు రానున్న ఎన్నికల్లో కచ్చితంగా కలిసొస్తాయని.. ఇందులో ఎలాంటి సందేహాలు అక్కర్లేదని బీజేపీ కార్యకర్తలు సైతం సోషల్‌ విూడియాలో తెగ పోస్టులు పెడుతున్నారు.
ఇవన్నీ ఒక ఎత్తయితే.. బీఆర్‌ఎస్‌కు ఎన్నికల వ్యూహకర్తగా పనిచేస్తున్న ప్రశాంత్‌ కిశోర్‌ ఇదంతా చేయిస్తున్నారనే టాక్‌ కూడా నడుస్తోంది. ఆయన ఉన్నది లేనట్లుగా.. లేనిది ఉన్నట్లుగా చిత్రీకరించడంలో దిట్ట అనే ఆరోపణలు బోలెడన్ని ఉన్నాయి. ఎన్నికలకు కూడా ఏడాది మాత్రమే సమయం ఉండటంతో ఇలాంటి ట్రిక్స్‌ అన్నీ పీకే టీమ్‌ చేయిస్తోందని సోషల్‌ విూడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి. గతంలో పశ్చిమ బెంగాల్‌లో తృణముల్‌ కాంగ్రెస్‌కు కూడా పీకే వ్యూహకర్తగా పనిచేశారు. అప్పట్లో బెంగాల్‌లో కూడా ఇలాంటి వ్యవహారాలు నడిచాయని ఇప్పుడే అవే తెలంగాణలోనూ అప్లయ్‌ చేస్తున్నారనే ఆరోపణలు ప్రతిపక్ష పార్టీల నుంచి వస్తున్నాయి. ఇలా ప్రత్యర్థులను ఉక్కిరి బిక్కిరి చేయడంలో తెలంగాణలో కేసీఆర్‌ సక్సెస్‌ అయ్యారని వార్తలు వస్తున్నాయి. ఇంత జరిగిన తర్వాత బీజేపీకి అస్సలు ఓట్లు పడే పరిస్థితి లేదని.. కచ్చితంగా బీఆర్‌ఎస్‌కు ఎదురేలేదని పార్టీ పెద్దలు చెప్పుకుంటున్నారట. అయితే.. అటు బీజేపీ, ఇటు బీఆర్‌ఎస్‌ మధ్య నిరుద్యోగులు మాత్రం నగిలిపోతున్నారు. ఇంత జరిగిన తర్వాత నిరుద్యోగులు అంతా ఎటువైటు అడుగులేస్తారు..? యూత్‌ ఎవరికి పట్టం కడతారనే విషయం పైనున్న పెరుమాళ్లకే ఎరుక.
మొత్తానికి చూస్తే.. బీఆర్‌ఎస్‌ మాత్రం తెగ సంబరపడిపోతోంది.. ఇటు బీజేపీ సైతం కేసీఆర్‌ అన్ని చేసినా తమకు ఫేవర్‌గానే ఉన్నాయని రానున్న రోజుల్లో తామేంటో చూపిస్తామన్నట్లుగా కమలనాథులు ఉన్నారు. ఇవన్నీ సరే.. ఇంత చేస్తున్న ఈ పార్టీలకు ఓట్లు ఎంత మాత్రం వస్తాయో ఏంటో మరి. ఫైనల్‌గా జనాలు మరీ ముఖ్యంగా తెలంగాణ యువత రానున్న ఎన్నికల్లో ఎవర్ని గెలిపిస్తుందో.. ఏ పార్టీని గద్దెనెక్కిస్తుందో తెలియాలంటే ఎన్నికలు పూర్తయ్యే వరకు వేచి చూడాల్సిందే మరి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *