మేడ్చల్ ఏసిపి వెంకట్ రెడ్డి తెలిపిన వివరాలనుసారం… మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కిష్టాపూర్ గ్రామంలో ఓ వ్యక్తి నిషేధిత డ్రగ్స్ అమ్ముతున్నారని సమాచారం మేరకు, మెరుపు దాడి చేసి డ్రగ్స్ సరఫరా చేస్తున్న వ్యక్తిని అదుపులో తీసుకున్నట్లుగా ఏసీపీ తెలిపారు. కిష్టాపూర్ లో డ్రగ్స్ సరఫరా చేస్తున్న సదరు వ్యక్తి పేరు పోతిరెడ్డి అలియాస్ రవి అలియాస్ మెహర్ బాబా గా గుర్తించినట్లుగా ఏసీపీ తెలిపారు. సదరు వ్యక్తి వెస్ట్ గోదావరి ప్రాంతానికి చెందిన వ్యక్తిగా తెలిసిందన్నారు. కాగా సదరు పోతిరెడ్డి గతంలో గోవాకు వెళ్ళగా అక్కడ డ్రగ్స్ కు బానిస అయ్యాడని, అదే క్రమంలో జెన్నీ అనే వ్యక్తి నుండి డ్రగ్స్కొనుగోలు చేసి ఇక్కడకు తీసుకువచ్చి అమ్ముతున్నట్లుగా నిందితుడు తెలిపాడని ఏసీపీ తెలిపారు. కాగా సదరు జెన్నీ కొరకు కూడా పోలీసులు గాలిస్తున్నారని తెలిపారు. నిందితుడు పోతిరెడ్డి నుండి ద్విచక్ర వాహనం, రెండు సెల్ ఫోన్లుతో పాటుగా, మూడు లక్షల 80 వేల విలువచేసే నిషేధిత 41 గ్రాముల డ్రగ్ను సైతం స్వాధీనం చేసుకున్నట్లుగా ఏసిపి వెంకట్ రెడ్డి తెలిపారు. ప్రజలు కూడా వారికి ఏదైనా సమాచారం తెలిస్తే, తప్పక పోలీసులకు తెలియజేసి సమాజాన్ని డ్రగ్ సరిహిత సమాజంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని ఆయన కోరారు