ఒంగోలు : రైలు కిందపడి వదిన, మరిది ఆత్మహత్యచేసుకున్నారు. ప్రకాశం జిల్లా కంభం మండలం సైదాపురం గ్రామ సవిూపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పెద్దారవీడు మండలం బద్దిడు గ్రామానికి చెందిన రాములమ్మ ,శ్రీను ఆత్మహత్యకు పాల్పడ్డారు. సోమవారం రాత్రి ఇంటి నుంచి బయటకు వచ్చిన వదిన,మరిది కంభం మండలం సైదాపురం గ్రామ సవిూపంలో ఈ రోజు రైలు కింద పడి ఆత్మహత్య చేసున్నారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాలను పోస్ట్ మర్టం నిమిత్తం కంభం ప్రభుత్వ ఆసుపత్రి కి తరలిచారు.