వడగండ్ల వానతో నష్టపోయిన రైతులు అధైర్య పడొద్దని సీఎం కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్లి నష్టపరిహారం అందించి రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని రైతులకు మంత్రి భరోసానిచ్చారు. యుద్ధప్రాతిపదికన నష్టపోయిన ధాన్యం పంటల వివరాలు సేకరించాలని జిల్లా అధికార యంత్రాంగానికి మంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. సిద్ధిపేట అర్బన్ మండలం నాంచారుపల్లి గ్రామంలో వడగండ్ల వానతో తీవ్రంగా దెబ్బతిన్న వరి పంటలను రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. వడగండ్ల వానతో నష్టపోయిన రైతులు అధైర్య పడొద్దని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి నష్టపరిహారం అందించి రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని రైతులకు మంత్రి భరోసా ఇచ్చారు. యుద్ధప్రాతిపదికన నష్టపోయిన ధాన్యం పంటల వివరాలు సేకరించాలని జిల్లా అధికార యంత్రాంగానికి మంత్రి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. క్షేత్రస్థాయిలో నష్టపోయిన పంట పరిశీలనలో మంత్రి వెంట జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, వ్యవసాయ శాఖ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.