
రైతుబంధు అనుమానం: ఎన్నికల తర్వాత వర్తించదా? — కేటీఆర్ ఆరోపణ
As Telangana braces for local body elections, BRS leader KTR accused Chief Minister Revanth Reddy of misusing farmer welfare schemes like Rythu Bandhu for electoral gains, questioning if the benefits would continue after the polls.
హైదరాబాద్‌లో స్థానిక సంస్థల ఎన్నికల వేళ సీఎం రేవంత్ రెడ్డి వ్యవసాయ బంధాలకు ఎన్నికల ప్రేరణతో నగదు విడుదల చేస్తున్నాడని బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు. “రైతులకు మూడు పంటలకు ఎకరానికి రూ.15 వేలు ఇస్తానన్నాడు, కానీ ఎవరికైనా పడ్డాయా?” అని ప్రశ్నించారు.
“ఇప్పుడు ఎన్నికలుంటాయనే రైతు భరోసా డబ్బులు ఇచ్చాడు. కానీ ఎన్నికలు అయిపోతే రైతుబంధుకూ రాం రాం అంటాడు. నాలుగు పంటలకోసం అసలు రైతులకు రూ.24 వేల కోట్లు, కౌలు రైతులకు రూ.15 వేల కోట్లు.. కలిపి రూ.39 వేల కోట్లు ఎగనామేశాడు,” అని కేటీఆర్ ఆరోపించారు.
రైతు రుణమాఫీ విషయంలోనూ రేవంత్ విఫలమయ్యారని, దాదాపు రూ.38 వేల కోట్లు రైతుల రుణ మాఫీ పేరుతో వాయిదా వేస్తున్నారని ఆరోపించారు. “కేసీఆర్ నాట్లు వేసేటప్పుడు రైతు బంధు ఇచ్చాడు, కానీ రేవంత్ ఓట్లు వేసేటప్పుడు రైతుబంధు ఇస్తున్నాడు” అంటూ వ్యాఖ్యానించారు.
ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమంపై ఎంతవరకు కట్టుబడి ఉందన్న ప్రశ్న తిరిగి తెరపైకి వచ్చింది.