ఈ రోజు ప్రపంచ మలేరియా దినోత్సవం… ఎందుకు మలేరియా దినోత్సవం ప్రకటించాల్సి వచ్చింది…


మలేరియాకు కూడా ఒక దినం ఉన్నదోచ్‌… మలేరియా వ్యాధి నిర్మూలన, ప్రజలలో ఈ వ్యాధి పట్ల అవగాహనా కలిపించడం ఈ దినోత్సవ ముఖ్యోద్దేశ్యం. ప్రపంచవ్యాప్తంగా, 106 దేశాల్లో 3.3 బిలియన్‌ ప్రజలు మలేరియా బారిన పడుతున్నారు. 2012లో, మలేరియా వలన 6,27,000 మంది మరణించారు. మరణించినవారిలో ఎక్కువగా ఆఫ్రికన్‌ పిల్లలు ఉన్నారు. 2007లో ప్రపంచ ఆరోగ్య సంస్థ సభ్యదేశాలన్ని కలిసి ఈ ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని ఏర్పాటుచేశాయి. ఈ దినాన్ని ప్రతిసంవత్సరం ఏప్రిల్‌ 25 జరుపుకుంటారు. ప్రపంచ దేశాలన్నింటిలో నైజీరియా, డెమోక్రటిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగో, మొజాంబిక్‌, బుర్కినా ఫాసో, సియర్రా లియోన్‌ వంటి ఐదు దేశాలు ఎక్కువగా మలేరియా వ్యాధి బారినపడ్డాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక వెల్లడిరచింది. తాజాగా 2015లో ప్రపంచవ్యాప్తంగా 429,000 మలేరియా మరణాలు, 212 మిలియన్‌ కొత్త కేసులు నమోదయ్యాయి. 2010, 2015 మధ్యకాలంలో కొత్త మలేరియా కేసుల రేటు ప్రపంచవ్యాప్తంగా 21 శాతం పడిపోవడమేకాకుండా మలేరియా మరణాల రేటు 29 శాతానికి తగ్గింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *