రేపు కేసీఆర్, కేటీఆర్ పరిస్థితి కూడా ఇదే అవుతుందని హరీష్ కుట్రలో తనను పార్టీ నుంచి పంపించారని కవిత విమర్శించారు.

రేపు కేసీఆర్, కేటీఆర్ పరిస్థితి కూడా ఇదే అవుతుందని హరీష్ కుట్రలో తనను పార్టీ నుంచి పంపించారని కవిత విమర్శించారు.
హైదరాబాద్:
బీఆర్‌ఎస్ నేత కవిత, పార్టీ నుంచి తన సస్పెన్షన్ తర్వాత హరీష్ రావుపై తీవ్ర విమర్శలు చేశారు. తనను పార్టీ నుంచి బయటకు పంపించేది హరీష్ రావు కుట్రేనని ఆరోపించారు. రేపు కేసీఆర్, కేటీఆర్ లను కూడా ఇదే తరహాలో బయటకు పంపి పార్టీని హరీష్ తన ఆధీనంలోకి తీసుకుంటాడని ఆమె వ్యాఖ్యానించారు.

కాళేశ్వరం ప్రాజెక్టులో హరీష్ భారీ స్కాం చేసి ఆ డబ్బుతో ఎమ్మెల్యే అభ్యర్థులను ఫండింగ్ చేశారని కవిత ఆరోపించారు. కేటీఆర్‌ను ఓడించడానికి సిరిసిల్లకు అరవై లక్షలు పంపాడని చెప్పారు. ప్రభుత్వం మారిన తర్వాత రేవంత్, హరీష్ ఒకే విమానంలో ప్రయాణించారా అనే విషయంలో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. రేవంత్‌కు హరీష్ పూర్తిగా లొంగిపోయారని, తన డెయిరీ నుంచి హాస్టళ్లకు పాలు సరఫరా చేస్తున్నారని విమర్శించారు. అందరిపై కేసులు పెట్టినప్పుడు ఒక్క హరీష్‌పైన మాత్రం ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు.

కేసీఆర్ వెంట హరీష్ ఎప్పుడూ నిలబడలేదని కవిత అన్నారు. టీడీపీ డిప్యూటీ స్పీకర్ పదవికి కేసీఆర్ రాజీనామా చేసే సమయంలో కూడా హరీష్ ఆపేశారని ఆరోపించారు. పార్టీ సంక్షోభ సమయంలో హరీష్ వైఎస్ రాజశేఖరరెడ్డిని కలిశారని గుర్తుచేశారు. ఆయన ట్రబుల్ షూటర్ కాదని, డబుల్ షూటర్ అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

కేసీఆర్, కేటీఆర్‌లకు హాని కలిగించే పని తాను ఎప్పుడూ చేయనని కవిత స్పష్టం చేశారు. అయితే పార్టీకి పెద్ద నష్టం చేస్తూనే ఉన్న హరీష్, సంతోష్‌లను ఎందుకు ప్రోత్సహిస్తున్నారో తన ఆవేదన అని తెలిపారు. సంతోష్ వల్ల రామన్న పేరు చెడిపోయిందని అన్నారు. బంగారు తెలంగాణ అంటే హరీష్, సంతోష్ ఇళ్లలో బంగారం ఉంటేనేనా అని ప్రశ్నించారు. మోకిలాలో సంతోష్ 750 కోట్ల ప్రాజెక్టును చేపట్టారని, గ్రీన్ ఇండియా పేరిట నకిలీ కార్యక్రమాలు పెట్టి అడవులను నాశనం చేయాలని కుట్ర చేశారని ఆరోపించారు.
Hyderabad:
BRS leader Kavitha launched a sharp attack on Harish Rao after being suspended from the party. She accused him of conspiring to remove her and predicted that soon KCR and KTR too would be sidelined, with Harish taking control of the party.

Kavitha alleged that Harish was involved in a massive scam in the Kaleshwaram project and used those funds to support MLA candidates. She claimed that Harish sent ₹60 lakh to Siricilla to defeat KTR. She further demanded clarification on whether Revanth Reddy and Harish Rao travelled together in the same flight after the change of government, alleging Harish had surrendered completely to Revanth. She accused him of supplying milk from his dairy to hostels and questioned why no cases were filed against him while others faced legal troubles.

Kavitha also recalled that Harish was never fully supportive of KCR, even stopping him from resigning during the TDP Deputy Speaker controversy. She accused Harish of meeting Y.S. Rajasekhar Reddy when the party was in crisis. Calling him a “double shooter” rather than a troubleshooter, she said he was working against KCR and KTR.

Kavitha clarified that she would never work against KCR or KTR. However, she expressed anguish over Harish and Santosh being encouraged despite causing serious damage to the party. She accused Santosh of bringing a bad name to Ramanna and questioned whether “Bangaru Telangana” meant gold in Harish and Santosh’s houses. She alleged Santosh undertook a ₹750 crore project in Mokila and plotted to destroy forests through a fake program under the name “Green India.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *