వరంగల్ : పెళ్లింట విషాదం చోటు చేసుకుంది. రెండు రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కబోతున్న వరున్ని రోడ్డు ప్రమాదం మింగేసింది. వరంగల్ నగరంలోని రామన్నపేటకు చెందిన దేవరకొండ సాగర్ కు ఈ నెల 12 న వివాహం జరగనుంది. సాగర్ వివాహం కోసం కుటుంబ సభ్యులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. సంతోషంగా పెళ్లి తంతు ముగుస్తుందనుకున్న సాగర్ కుటుంబ సభ్యులు పిడుగు లాంటి వార్త వినాల్సి వచ్చింది. నిన్న రాత్రి నగరంలోని నిర్మల మాల్ వద్ద బైక్ పై రోడ్డు క్రాస్ చేస్తుండగా, అతి వేగంగా వచ్చిన మరో బైక్ సాగర్ ను బలంగా ఢీకొట్టింది. తీవ్ర రక్తస్రావంతో సాగర్ అక్కడికక్కడే మృతి చెందాడు. సంతోషంతో కళకళలాడాల్సిన ఇల్లు సాగర్ మృతితో దుఖ సాగరంలో మునిగింది….. పెళ్ళింట విషాదం నెలకొనడంతో రామన్నపేట కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి…..