రూ.2 వేల నోట్ల మార్పిడిపై.. గడువు పొడిగింపును పరిశీలిస్తాం..ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌..

న్యూఢల్లీ : రూ.2,000 నోట్ల మార్పిడి ప్రక్రియ ఈనెల 23 నుంచి ప్రారంభమవుతోందని, దేశంలోని అన్ని బ్యాంకుల కౌంటర్లలోను రూ. 2,000 నోట్లను ఇతర డినామినేషన్‌ల నోట్‌లుగా మార్చుకోవచ్చని, ఒక్కో విడతలో రూ.20 వేల విలువైన నోట్లను ఎక్స్చేంజ్‌ చేసుకోవచ్చని ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ తెలిపారు. నోట్ల మార్పిడికి తగిన ఏర్పాట్లు చేసుకోవాలని బ్యాంకులకు ఇప్పటికే మార్గదర్శకాలు జారీ చేసినట్టు చెప్పారు. రూ.50,000 కంటే ఎక్కువ మొత్తంలో డిపాజిట్లకు పాన్‌ సమర్పించాలనే నిబంధన ఇప్పటికే ఉందని ఆయన గుర్తు చేశారు.
గడువు పొడిగింపును పరిశీలిస్తాం…
నోట్ల మార్పిడికి తగినంత గడువు ఉన్నందున బ్యాంకుల వద్ద ప్రలు హడావిడి పడవలసిన అవసరం లేదని శక్తికాంత దాస్‌ తెలిపారు. సెప్టెంబర్‌ 30 వరకూ నాలుగు నెలల సమయం ఉందని గుర్తు చేశారు. దీన్ని సీరియస్‌గా తీసుకుని రూ.2 వేల నోట్లన్నీ వాపస్‌ చేస్తారనే ఉద్దేశంతోనే ఇంత సమయం ఇచ్చామన్నారు. పరిస్థితులను పరిగణలోకి తీసుకుని సెప్టెంబర్‌ గడువును పొడిగించే విషయాన్ని పరిశీలిస్తామని ఆయన తాజా ఇంటర్వ్యూలో ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
బ్యాంకులకు అదేశాలిచ్చాం…
బ్యాంకులకు జమ అయ్యే రూ.2,000 నోట్ల స్థానంలో ఇతర నోట్లను ఇచ్చేందుకు తగినంత నగదు అందుబాటులో ఉంచామని, వేసవిని దృష్టిలో ఉంచుకుని నోట్ల మార్పిడి కోసం వచ్చే వారికి నీడ, నీళ్లు అందుబాటులో ఉండేలా చూడాలని బ్యాంకులకు ఆదేశాలిచ్చామని, కౌంటర్లన్నింటిలోనూ నోట్లను మార్చుకునే వెసులుబాటు కల్పించాలని సూచించామని శక్తికాంత దాస్‌ చెప్పారు. నోట్ల ఉపసంహరణ వల్ల ఆర్థిక వ్యవస్థపై ప్రబావం చాలా తక్కువగానే ఉంటుందని ఒక ప్రశ్నకు సమాధానంగా తెలిపారు.
డిపాజిట్ల విషయంలో…
డిపాజిట్ల విషయంలో ఇప్పుడు అనుసరిస్తున్న నిబంధనలనే రూ.2,000 నోట్ల డిపాజిట్లకూ వర్తిస్తాయని చెప్పారు. రూ.50,000 కంటే ఎక్కువ మొత్తంలో డిపాజిట్లకు పాన్‌ సమర్పించాలనే నిబంధన ఇప్పటికే ఉందని ఆయన గుర్తు చేశారు. పెద్ద మొత్తంలో అయ్యే డిపాజిట్ల తనిఖీ అంశం ఆదాయ పన్ను శాఖ చూసుకుంటుందన్నారు.
నగుదు నిర్వహణలో భాగంగానే..
నగగు నిర్వహణలో భాగంగానే రూ.2,000 నోట్లను ఉపసంహరించుకుంటున్నామని చెప్పారు. అప్పట్లో (2016) పెద్ద నోట్ల రద్దు తర్వాత వ్యవస్థలోకి వేగంగా నగదును చొప్పించడంలో భాగాంగానే రూ.2,000 నోటును తీసుకువచ్చామని వివరించారు. సెప్టెంబర్‌ 30 నాటికి చాలా వరకూ నోట్లు ఖజానాకు చేరుతాయని అశిస్తున్నట్టు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *