రాహుల్ గాంధీ స్టే పిటిషన్ ను తిరస్కరించిన సూరత్ సెషన్స్ కోర్ట్
పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీ ని దోషిగా ప్రకటిస్తూ ఇచ్చిన తీర్పు పై స్టే ఇవ్వాలంటూ సూరత్ సెషన్స్ కోర్ట్ ను ఆశ్రయించిన రాహుల్ గాంధీకి చుకెదురు. రాహుల్ గాంధీ స్టే పిటిషన్ ను తిరస్కరించిన సూరత్ సెషన్స్ కోర్ట్ .
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కి గుజరాత్‌లోని సూరత్ కోర్టులో చుక్కెదురైంది. 2019లో కర్ణాటకలో ఆయన మోదీ ఇంటి పేరు గలవారిపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన కేసులో క్రింది కోర్టు ఆయనను దోషిగా తీర్పు చెప్పడంపై ఆయన చేసిన అపీలును సూరత్ సెషన్స్ కోర్టు గురువారం తిరస్కరించింది. క్రింది కోర్టు తీర్పును నిలుపుదల చేయాలని, సస్పెండ్ చేయాలని ఆయన చేసిన వినతిని సెషన్స్ కోర్టు అంగీకరించలేదు. ఆయన అపీలుపై ఇరు పక్షాల వాదనలను ఏప్రిల్ 13న కోర్టు స్వీకరించింది. అనంతరం తీర్పును రిజర్వు చేసింది. ఈ తీర్పు గురువారం వెలువడిరది.రాహుల్ గాంధీ 2019లో కర్ణాటకలోని కోలార్‌లో ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ, దొంగలందరి ఇంటి పేరు మోదీ ఎలా అవుతోందని ప్రశ్నించారు. దీనిపై గుజరాత్‌కు చెందిన పూర్ణేశ్ మోదీ సూరత్ కోర్టులో పరువు నష్టం కేసు దాఖలు చేశారు. ఈ కేసులో రాహుల్ గాంధీ దోషి అని కోర్టు తీర్పు చెప్పింది. ఆయనకు రెండేళ్ళ జైలు శిక్ష విధించింది. దీంతో ఆయన లోక్‌సభ సభ్యత్వం రద్దయింది. ఇది కక్షపూరిత చర్య అని కాంగ్రెస్, ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.సెషన్స్ కోర్టు రాహుల్ గాంధీ అపీలును అనుమతించినట్లయితే, ఆయనకు విధించిన శిక్ష, దోషిత్వ తీర్పును సస్పెండ్ చేసి ఉంటే, ఆయన లోక్‌సభ సభ్యత్వం పునరుద్ధరణ జరిగి ఉండేది.