రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు భద్రత, ఆరోగ్య పరిరక్షణలో కీలక నిర్ణయాలు తీసుకుంటూ మంత్రివర్గం రెండు ప్రధాన పథకాలకు ఆమోదం తెలిపింది. ప్రమాద బీమా, క్యాష్‌లెస్ హెల్త్ స్కీమ్‌తో లక్షలాది ఉద్యోగులు, పెన్షనర్లకు నేరుగా లాభం చేకూరనుంది.

Telangana Cabinet approved accident insurance and a cashless health scheme, offering major security cover and medical benefits to lakhs of employees and pensioners.

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రిమండలి సమావేశంలో ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమంపై పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఉద్యోగులకు పూర్తి భద్రత కల్పించే ఉద్దేశంతో రెండు కొత్త పథకాలకు ఆమోదం లభించింది.

ఉద్యోగుల ప్రమాద బీమా పథకం కింద రాష్ట్రంలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఒక్క రూపాయి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేకుండా బీమా సౌకర్యం పొందనున్నారు. ఉద్యోగి ప్రమాదంలో మరణిస్తే రూ.1.2 కోట్ల బీమా పరిహారం అందుతుంది. 60 ఏళ్ల లోపు సహజ మరణం సంభవించినా రూ.10 లక్షల టర్మ్ ఇన్సూరెన్స్ ప్రయోజనం లభిస్తుంది. ఈ పథకం రాష్ట్రంలోని ప్రభుత్వ, కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థల పరిధిలో ఉన్న 5.19 లక్షల రెగ్యులర్ ఉద్యోగులు, 2.38 లక్షల పెన్షనర్లు కలిపి మొత్తం 7.57 లక్షల మందికి వర్తిస్తుంది.

క్యాష్‌లెస్ ఎంప్లాయ్ హెల్త్ స్కీమ్ (EHS) అమలుకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 3.56 లక్షల రెగ్యులర్ ఉద్యోగులు, 2.88 లక్షల పెన్షనర్లు మరియు వారి ఆధారిత కుటుంబ సభ్యులు కలిపి మొత్తం 17.07 లక్షల మందికి ఈ పథకం వర్తిస్తుంది. ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు 652 ఎంపానెల్ ప్రైవేట్ ఆసుపత్రుల్లో 1998 రకాల వైద్య చికిత్సలు పూర్తిగా క్యాష్‌లెస్ విధానంలో అందుబాటులో ఉంటాయి.

ఈ పథకాన్ని రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ద్వారా అమలు చేస్తారు. ప్రతి ఉద్యోగికి డిజిటల్ హెల్త్ కార్డు జారీ చేస్తారు. ఉద్యోగులు తమ బేసిక్ పే నుంచి 1.5 శాతం చెల్లిస్తే, అంతే మొత్తాన్ని ప్రభుత్వం మ్యాచింగ్ వాటాగా చెల్లిస్తుంది. సంవత్సరానికి ఉద్యోగుల నుంచి రూ.528 కోట్లు, ప్రభుత్వ వాటాతో కలిపి మొత్తం రూ.1056 కోట్లతో ఈ పథకం అమలవుతుంది.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవలను మెరుగుపర్చేందుకు తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ను డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ కేర్‌గా మార్చాలని నిర్ణయించారు. ఆరోగ్య రంగ సంస్కరణలపై అధ్యయనం చేసేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశారు.

ఇతర ముఖ్య నిర్ణయాల్లో హెచ్ఎండీఏ పరిధిలోకి వికారాబాద్ జిల్లా నాలుగు గ్రామాలను చేర్చడం, హైదరాబాద్ మెట్రో ఫేజ్-1ను ఎల్ అండ్ టీ నుంచి స్వాధీనం చేసుకోవడం, ఫేజ్-2ను కేంద్ర-రాష్ట్ర సంయుక్త భాగస్వామ్యంతో విస్తరించడం ఉన్నాయి. రంగారెడ్డి జిల్లాలో మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్క్, ఫుడ్ ప్రాసెసింగ్ పార్క్ కోసం భూముల బదిలీకి ఆమోదం లభించింది.

టీజీ హౌసింగ్ బోర్డు భూముల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో పండ్ల మార్కెట్ ఏర్పాటు, జేఎన్టీయూ మరియు శాతవాహన యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ కళాశాలల నిర్మాణానికి భూముల కేటాయింపు, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణం, భద్రాచలంలో మినీ స్టేడియం నిర్మాణం వంటి నిర్ణయాలు కూడా తీసుకున్నారు.

The Cabinet meeting chaired by Chief Minister Revanth Reddy at the Dr B.R. Ambedkar Secretariat approved key welfare measures for state government employees. The accident insurance scheme offers ₹1.2 crore compensation in case of accidental death and ₹10 lakh term insurance for natural death below 60 years, benefiting 7.57 lakh employees and pensioners.

The Cashless Employee Health Scheme will cover 17.07 lakh beneficiaries, including dependents, across government and 652 empanelled private hospitals. Around 1,998 treatments will be provided without upfront payment. The scheme will be implemented through the Rajiv Aarogyasri Health Care Trust with digital health cards issued to employees.

The Cabinet also cleared several infrastructure and development decisions, including Metro expansion, logistics parks, educational institutions, and inclusion of villages under HMDA limits.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *