యాదాద్రి భువనగిరి : రాష్ట్రంలో ప్రతిపక్షాల భాగస్వామ్యం లేకుండా చేస్తున్నారని, ప్రజాస్వామ్య పాలన సాగడం లేదని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క మండిపడ్డారు. ఇక మళ్లీ అధికారంలోకి రాలేమని, రాష్ట్రాన్ని అమ్మేసే కార్యక్రమాన్ని మొదలు పెట్టి అమ్మేస్తున్నారని మండిపడ్డారు. ఈ నాలుగైదు నెలలు తెలంగాణ ప్రజలు ఆస్తులను కాపాడుకోవాలని సూచించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మంచి ఫలితాలు రాబోతున్నాయని, వచ్చేది ఇందిరమ్మ రాజ్యమేనని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో తనను ఎదిరించిన వారు ఉండకుండా కేసీఆర్ నియంతృత్వ, రాజరిక పోకడలతో పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. మంత్రి కేటీఆర్ ఔటర్ రింగ్ రోడ్డు 30 ఏళ్ళు లీజ్ ఎలా ఇస్తారు? అని ఆయన ప్రశ్నించారు.