రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న మున్సిపల్ ఓట్ల లెక్కింపు …

Municipal Vote Counting continuing Across the State

రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు శుక్రవారం ఉదయం ప్రారంభమైంది. 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలకు జరిగిన ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది.

మొత్తం 123 కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించిన అనంతరం సాధారణ బ్యాలెట్ పత్రాల లెక్కింపు ప్రారంభించారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ప్రక్రియ సాగుతోంది.

మధ్యాహ్నం నాటికి మున్సిపాలిటీల ఫలితాలు వెలువడే అవకాశం ఉండగా, సాయంత్రానికి కార్పొరేషన్ల ఫలితాలు ప్రకటించే వీలుందని అధికారులు తెలిపారు. వివిధ ప్రాంతాల్లో ఆధిక్యాలపై రాజకీయ వర్గాల్లో చర్చలు కొనసాగుతున్నాయి.

Municipal Vote Counting Begins Across the State

Counting of votes for municipal elections commenced across the state on Friday morning. Results of elections held for 7 corporations and 116 municipalities are eagerly awaited.

Vote counting is underway at 123 centres. Officials began with postal ballots, followed by the counting of regular ballot papers under tight security arrangements.

Municipality results are likely to be declared by afternoon, while corporation results are expected by evening, officials said. Political circles are closely tracking early leads from various regions.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *