రాజ్యసభలో ఖాళీ కాబోతున్న 37 స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. తెలంగాణకు చెందిన రెండు స్థానాలకు కూడా మార్చి 16న ఎన్నికలు జరగనున్నాయి.

. The Election Commission has released the schedule for Rajya Sabha elections to fill 37 vacant seats across 10 states, including two seats from Telangana, with polling on March 16.

రాజ్యసభలో ఖాళీ కాబోతున్న 37 స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. తెలంగాణకు చెందిన రెండు స్థానాలకు కూడా మార్చి 16న ఎన్నికలు జరగనున్నాయి. The Election Commission has released the schedule for Rajya Sabha elections to fill 37 vacant seats across 10 states, including two seats from Telangana, with polling on March 16.

కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం ఉదయం రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది. మొత్తం 10 రాష్ట్రాల్లో 37 స్థానాలు ఖాళీ కానుండగా, వాటి భర్తీకి ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇందులో తెలంగాణ రాష్ట్రానికి చెందిన రెండు స్థానాలు ఉన్నాయి.

షెడ్యూల్ ప్రకారం ఈనెల 26న నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. మార్చి 5 వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. మార్చి 9 వరకు ఉపసంహరణకు గడువు ఉంది. మార్చి 16న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. అదే రోజు సాయంత్రం 6 గంటల తర్వాత ఓట్ల లెక్కింపు చేపడతారు.

మహారాష్ట్రలో అత్యధికంగా ఏడు స్థానాలు ఖాళీ కానున్నాయి. తెలంగాణ నుంచి కేఆర్ సురేశ్ రెడ్డి మరియు అభిషేక్ మను సింఘ్వీ పదవీకాలం ఏప్రిల్ 9న ముగియనుంది. మహారాష్ట్రకు చెందిన సభ్యుల పదవీకాలం ఏప్రిల్ 2న ముగుస్తుంది.

రాష్ట్రాల వారీగా ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి: మహారాష్ట్రలో 7, ఒడిశాలో 4, తమిళనాడులో 6, పశ్చిమ బెంగాల్‌లో 5, అస్సాంలో 3, బిహార్‌లో 5, ఛత్తీస్‌గఢ్‌లో 2, హరియాణాలో 2, హిమాచల్ ప్రదేశ్‌లో 1, తెలంగాణలో 2 స్థానాలు ఖాళీ కానున్నాయి. ఈ స్థానాల భర్తీ కోసం మార్చి 16న ఎన్నికలు నిర్వహించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *