
Image: Screenshot from ‘ ; https://x.com/DamodarCilarapu ” (used under fair use for reporting)
రాజకీయ లాభం కోసం ప్రభుత్వ ఆసుపత్రులపై తప్పుడు ప్రచారం — ప్రజలే సమాధానం చెబుతారు: మంత్రి దామోదర్ రాజనర్సింహ
Political Gain Behind False Propaganda on Government Hospitals — People Will Teach a Lesson, Says Minister Damodar Rajanarasimha
ప్రభుత్వ హాస్పిటళ్లపై కొంతమంది రాజకీయ ప్రయోజనాల కోసం తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజల్లో అపనమ్మకం కలిగించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. బస్తీ దవాఖానలు, డయాగ్నస్టిక్స్ హబ్‌లు ద్వారా ప్రతిరోజూ వేలాది మంది పేద ప్రజలకు ఉచిత వైద్యసేవలు అందిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.
Health Minister Damodar Rajanarasimha said that certain individuals were deliberately spreading false propaganda against government hospitals for political gain, creating distrust among the public. He asserted that through Basti Dawakhanas and diagnostic hubs, thousands of poor citizens are receiving quality medical care daily.
రాష్ట్రవ్యాప్తంగా బస్తీ దవాఖానల ద్వారా రోజుకు సుమారు 45 వేలమందికి వైద్య సేవలు అందుతున్నాయని తెలిపారు. అన్ని రకాల మందులు ఈ దవాఖానల్లో అందుబాటులో ఉన్నాయని, డయాగ్నస్టిక్స్ హబ్‌ల ద్వారా పేషెంట్లకు 134 రకాల టెస్టులు ఉచితంగా నిర్వహిస్తున్నామని వివరించారు. టెస్ట్ రిపోర్టులు 24 గంటలలోపు అందిస్తున్నామని చెప్పారు.
He mentioned that around 45,000 patients are being treated every day through Basti Dawakhanas across the state. All categories of medicines are available there, and 134 types of diagnostic tests are being conducted free of cost, with reports delivered within 24 hours.
బస్తీ దవాఖానలలో సేవలు మెరుగుపడటంతో గాంధీ, ఉస్మానియా వంటి ప్రధాన ఆసుపత్రులపై రద్దీ తగ్గిందని మంత్రి తెలిపారు. పేదలకు వైద్య సేవలు అందించే ప్రభుత్వ ఆసుపత్రులపై కొందరు రాజకీయ ప్రయోజనాల కోసం బురదజల్లుతున్నారని ఆయన విమర్శించారు.
The minister stated that the improved services at Basti Dawakhanas have reduced patient pressure on major hospitals like Gandhi and Osmania. He criticized that some political elements were maligning public hospitals that serve the poor.
ప్రైవేట్ హాస్పిటళ్లకు లబ్ది చేకూర్చేందుకు తప్పుడు ప్రచారం చేస్తున్నవారిని ప్రజలు గమనిస్తున్నారని దామోదర్ రాజనర్సింహ హెచ్చరించారు. “ప్రజలే వారికి సరైన సమయంలో గుణపాఠం చెబుతారు. ఇలాంటి కుట్రలు మా వైద్య సిబ్బంది మనోధైర్యాన్ని దెబ్బతీయలేవు. ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు మేము కట్టుబడి ఉన్నాం,” అని మంత్రి పేర్కొన్నారు.
He warned that the public was aware of those spreading falsehoods to benefit private hospitals. “The people themselves will teach them a lesson at the right time. Such conspiracies cannot shake the morale of our doctors and staff. We remain committed to delivering even better medical services to the people,” the minister concluded.