సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ రష్మిక ప్రస్తుతం టాప్ హీరోయిన్ గా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. తెలుగులో పుష్ప సీక్వెల్ తో ఈ అమ్మడు మరోసారి తన సత్తా నిరూపించుకోవాలని భావిస్తుంది. ఇక హిందీలో యానిమల్ మూవీలో రణబీర్ కపూర్ కి జోడీగా నటిస్తుంది. ఆ సినిమా మీద రష్మిక చాలా హోప్స్ పెట్టుకుంది. యానిమల్ హిట్ అయితే బాలీవుడ్ లో కూడా జెండా పాతేయవచ్చని అనుకుంటుంది. ఇక రీసెంట్ గా సంక్రాంతి బరిలో వారసుడు సినిమాతో ఈ అమ్మడు ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఇదిలా ఉంటే కోలీవుడ్ లో కొన్ని పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నాయి. ఇక రష్మిక ఎంత హాట్ గా ఉంటుందో అంత ఫిట్ గా ఉంటుంది అనే సంగతి అందరికి తెలిసిందే. సౌత్ లో సమంత తర్వాత అంతగా ఫిట్ నెస్ మెయింటేన్ చేసేది మాత్రం కచ్చితంగా రష్మిక అని చెప్పాలి. పెర్ఫెక్ట్ లుక్ కోసం ఈమె ప్రతి రోజు కతినమైన వ్యాయామాలు చేస్తుంది. ఉదయాన్నే వర్క్ అవుట్స్ అనేవి తన దినచర్యలో భాగంగా ఉంటాయి. ఇదిలా ఉంటే ఈ అమ్మడు తాజాగా ఇన్స్టాగ్రామ్ లో ఒక వీడియో షేర్ చేసింది. ఈ వీడియోలో జిమ్ లో ఆమె రెండు వెయిట్ బాల్స్ మధ్య బాడీని బ్యాలెన్స్ చేస్తూ పుష్ అప్స్ తీస్తుంది. నిజానికి ఇలా బాల్స్ మీద బాడీని బ్యాలెన్స్ చేయడం చిన్న విషయం అయితే కాదు. కాని రష్మిక మాత్రం ఆ ఫీట్ కూడా చేసి ఎట్రాక్ట్ చేస్తుంది. ఇక ఈ వీడియోకి అదిరిపోయే విధంగా కొన్ని లైన్స్ కూడా రాసుకొచ్చింది. ఒకప్పుడు ఒక స్ట్రాంగ్ విమెన్ ఉండేది అని నేను ఫ్యూచర్ లో నా గురుంచి చెప్పుకోవాలి. అలాంటి స్ట్రాంగ్ విమెన్ గా ఉండటానికి చేస్తున్న ప్రయత్నంలో భాగమే ఈ వీడియో. ఒక అమ్మాయిగా ప్రతి ఏదైనా నేను ఇది చూపించాలని అనుకుంటాను. అందులో భాగమే ఇది. క్రేజీగా అనిపించినా కూడా ఏదైనా ఒకటి చేయాలని అనుకుంటే కచ్చితంగా చేసి చూపించొచ్చు. అయితే దాని కోసం ఫోకస్ చేసి గట్టిగా ప్రయత్నం చేయాలి. అలా చేస్తే అనుకున్నది సాధ్యం అవుతుంది అంటూ చిన్న స్టొరీ రాసుకొచ్చింది. ఈ స్టొరీలైన్ కచ్చితంగా ప్రతి ఒక్క అమ్మాయికి స్పూర్తినిచ్చే విధంగా ఉందని చెప్పాలి అందుకే ఈ వీడియోకి ఏకంగా 7 లక్షల 83 వేలకి పైగా లైక్స్ వచ్చాయి.