రైతులకు శుభవార్త! రైతు భరోసా పథకానికి కొత్తగా అప్లై చేసుకునే అవకాశం…

Rythu Bharosa scheme now open for new eligible farmers in Telangana.

రైతు భరోసా పథకానికి కొత్తగా అప్లికేషన్లు స్వీకరిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. The Telangana government has announced fresh applications for the Rythu Bharosa scheme, offering support to eligible farmers.

రైతు భరోసా పథకం కింద ఇప్పటి వరకు పంట పెట్టుబడి సాయం అందని రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. కొత్తగా భూమి పట్టా పొందిన రైతులు (28.02.2026లోపు పట్టా పొందిన వారు) ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు.

The government has extended an opportunity for farmers who have not yet received input assistance under the scheme. Farmers who obtained land ownership (pattadar passbooks) on or before February 28, 2026, are eligible to apply.

రైతు భరోసా పథకం కింద ప్రతి ఏడాది ఎకరాకు రూ.12,000ను రెండు విడతల్లో రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం యాసంగి సీజన్‌కు సంబంధించిన పెట్టుబడి సాయాన్ని మార్చి 22 నుంచి మూడు విడతల్లో అందజేస్తామని ప్రభుత్వం ప్రకటించింది.

Under the scheme, ₹12,000 per acre is credited annually in two installments. For the current Yasangi season, the government will release assistance in three phases starting March 22.

మొదటి విడతలో ఎకరం వరకు భూమి కలిగిన సుమారు 70 లక్షల మంది రైతులకు రూ.3,590 కోట్లను విడుదల చేయనున్నారు. ఈ నిధులను సిద్ధిపేట జిల్లా నర్మెట్టలో జరిగే కార్యక్రమంలో విడుదల చేయనున్నారు.

In the first phase, ₹3,590 crore will be disbursed to around 70 lakh farmers owning up to one acre, with the launch event scheduled in Siddipet district.

రెండో విడతగా ఏప్రిల్ రెండో వారంలో నిధులు జమ చేయగా, మూడో విడతను ఏప్రిల్ చివరినాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మొత్తం మూడు విడతల్లో 1.50 కోట్ల ఎకరాలకు సంబంధించి రూ.9,000 కోట్లను ప్రభుత్వం జమ చేయనుంది.

The second installment will be credited in the second week of April, and the third phase by the end of April. Overall, ₹9,000 crore will be deposited covering 1.5 crore acres.

కొత్తగా దరఖాస్తు చేసుకునే రైతులు రైతు వేదికలు లేదా వ్యవసాయ విస్తరణ అధికారులను సంప్రదించి అప్లికేషన్ సమర్పించాలి. ఆధార్ కార్డు, పట్టాదారు పాస్ పుస్తకం, బ్యాంక్ ఖాతా వివరాలు సమర్పించాల్సి ఉంటుంది.

New applicants must submit forms at Rythu Vedikas or through agriculture extension officers, along with Aadhaar, pattadar passbook, and bank account details.

అర్హులైన రైతులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.

Officials have advised eligible farmers to apply at the earliest.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *