రైతులకు ఆధునిక వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు శామీర్‌పేట మండలంలో సబ్సిడీపై వ్యవసాయ యాంత్రికరణ పనిముట్లను పంపిణీ చేశారు….

రైతులకు ఆధునిక వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు శామీర్‌పేట మండలంలో సబ్సిడీపై వ్యవసాయ యాంత్రికరణ పనిముట్లను పంపిణీ చేశారు.

రైతులకు ఆధునిక వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు శామీర్‌పేట మండలంలో సబ్సిడీపై వ్యవసాయ యాంత్రికరణ పనిముట్లను పంపిణీ చేశారు. Subsidized farm mechanization equipment was distributed to farmers in Shamirpet mandal to encourage modern agricultural practices.

మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా, శామీర్‌పేట: ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం శామీర్‌పేట మండలం అలియాబాద్ మున్సిపల్ పరిధిలోని రైతు వేదికలో రైతులకు సబ్సిడీపై నూతన వ్యవసాయ పనిముట్లను పంపిణీ చేశారు. రైతులు ఆధునిక విధానాలతో సాగు చేయాలనే లక్ష్యంతో రోటవేటర్లు, స్ప్రేయర్లు, బేలర్స్ వంటి యాంత్రికరణ పరికరాలను అందజేశారు.

అలాగే ఎటీఎంఏ (ATMA) పథకం కింద వ్యవసాయ సాంకేతికతపై రైతులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మేలు రకం విత్తనాల ఎంపిక, యూరియా వినియోగం, ఆధునిక వ్యవసాయ పద్ధతులు, యూరియా బుకింగ్ యాప్ వినియోగం, వరి పంట సాగులో పాటించాల్సిన మెలకువల గురించి అధికారుల ద్వారా వివరించారు.

ఈ కార్యక్రమంలో మేడ్చల్ మార్కెట్ కమిటీ చైర్మన్ నర్సింలు యాదవ్, మున్సిపల్ చైర్‌పర్సన్ శిరీష కృష్ణారెడ్డి, జిల్లా ఆర్టీఏ సభ్యుడు జైపాల్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ మాలతి మాధవరెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ బిక్షపతి, జిల్లా వ్యవసాయ అధికారి చంద్రకళ, ఏడీఏ వెంకట్రాం రెడ్డి, వ్యవసాయ అధికారి రమేష్, ఏఈవోలు రవికుమార్, సుధీర్ కుమార్, కౌన్సిలర్లు వెంకటేశ్వర్లు, జస్వంత్ రెడ్డి, దీపిక, హనుమాన్ దాస్, వనజ, మౌనిక, దీప, యమునా, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. రైతులు కృష్ణారెడ్డి, సంజీవరెడ్డి, రవీందర్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, హరి శంకర్ గౌడ్, ఆనంద్, యాదయ్య కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు.

Farmers were provided with subsidized agricultural mechanization tools at the Rythu Vedika in Aliabad municipal area of Shamirpet mandal as part of the Praja Palana Pragati initiative under the Agriculture Department.

Equipment such as rotavators, sprayers and balers were distributed to promote modern farming practices and improve agricultural productivity. In addition, training programmes were conducted for farmers under the ATMA scheme focusing on agricultural technologies.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *