Ramya Krishna in Raaka Movie

‘రాకా’ సినిమాలో రమ్యకృష్ణ కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం వెలువడడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. In ‘Raaka’, Ramya Krishna is set to play a powerful role, raising expectations for the film.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘రాకా’ (Raaka) ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారుతోంది. సుమారు రూ.800 కోట్ల భారీ బడ్జెట్‌తో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని మరింత పెంచింది. ఇందులో ఆయన గుండుతో, భయంకరమైన గోళ్లతో ‘బీస్ట్’ లాంటి లుక్‌లో కనిపించడం విశేషం.
The big-budget film ‘Raaka’, starring Allu Arjun and directed by Atlee, has become a major talking point in the industry. Backed by Sun Pictures with an estimated budget of ₹800 crore, the film has already generated strong buzz. The first look poster released on Allu Arjun’s birthday grabbed attention, showcasing him in a fierce, beast-like avatar.
ఈ చిత్రంలో అల్లు అర్జున్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు సమాచారం. సైన్స్ ఫిక్షన్ మరియు పురాణాల మేళవింపుతో రూపొందుతున్న ఈ చిత్రం విజువల్ వండర్‌గా నిలవనుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సీనియర్ నటి రమ్యకృష్ణ కీలక పాత్రలో నటిస్తున్నట్లు తాజా సమాచారం బయటకు వచ్చింది. కథను మలుపు తిప్పే విధంగా ఆమె పాత్ర ఉండబోతోందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.
Reports suggest that Allu Arjun may be seen in a dual role in this film, which blends science fiction with mythological elements. The film is expected to be a visual spectacle. Meanwhile, senior actress Ramya Krishna is reportedly playing a crucial role that could significantly influence the storyline.
గతంలో ‘బాహుబలి’లో శివగామి పాత్రతో విశేష గుర్తింపు పొందిన రమ్యకృష్ణ, ఈ చిత్రంలో కూడా అదే స్థాయి ప్రభావం చూపిస్తారని మేకర్స్ భావిస్తున్నారు. త్వరలోనే ఆమె పాత్రపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది.
After her impactful performance as Sivagami in ‘Baahubali’, Ramya Krishna is expected to deliver another strong role in ‘Raaka’. An official announcement regarding her role is likely to be made soon.
ఈ చిత్రంలో దీపికా పదుకొనే హీరోయిన్గా నటిస్తుండగా, రష్మిక మందన్న, మృణాల్ ఠాకూర్ కీలక పాత్రల్లో కనిపించనున్నట్లు సమాచారం. హాలీవుడ్ టెక్నీషియన్ల సహకారంతో అత్యున్నత స్థాయి వీఎఫ్ఎక్స్ పనులు జరుగుతున్న ఈ చిత్రాన్ని 2027లో విడుదల చేయాలని మేకర్స్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
Deepika Padukone is reportedly playing the female lead, while Rashmika Mandanna and Mrunal Thakur are expected to appear in key roles. With high-end VFX work handled under Hollywood technicians, the makers are planning to release the film in 2027.