పవిత్ర రంజాన్ మాసం సందర్బంగా నెల రోజుల పాటు చేసే ఈ ఉపవాస దీక్ష చాలా గొప్పది అని మంత్రి చామకూర మల్లారెడ్డి గారు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నానని తెలిపారు. రంజాన్ పండుగ వేడుకలు ప్రతి ఒక్కరిలో ప్రేమ, సార్వత్రిక సోదరభావం నెలకొల్పాలని ఆయన ఆకాంక్షించారు. ముఖమంత్రి కేసీఆర్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముస్లింల అభివృద్ధి కోసం అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తోందని అన్నారు. ముస్లిం విద్యార్థుల కోసం ప్రత్యేకంగా మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేసి నాణ్యమైన విద్య అందిస్తున్నామన్నారు. మైనార్టీల అభివృద్ధి కొరకు ఎన్నో సంక్షేమ కార్యక్రమలు ప్రవేశ పెట్టి వారి అభివృద్ధికి తోడ్పాటు అందిస్తున్న ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర కెసిఆర్ ప్రభుత్వం.