యువ సామ్రాట్ నాగ చైతన్య, విరూపాక్ష దర్శకుడు కార్తీక్ దండుతో కలిసి మైథికల్ థ్రిల్లర్ #NC24లో నటించబోతున్నారు..Young actor

యువ సామ్రాట్ నాగ చైతన్య, విరూపాక్ష దర్శకుడు కార్తీక్ దండుతో కలిసి మైథికల్ థ్రిల్లర్ #NC24లో నటించబోతున్నారు. లాపతా లేడీస్ ఫేమ్ స్పర్ష్ శ్రీవాస్తవ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తూ తొలిసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
Young actor Naga Chaitanya teams up with Virupaksha director Karthik Dandu for the mythological thriller #NC24, where Lapataa Ladies fame Sparsh Shrivastava joins in a key role, marking his Telugu debut.

తండేల్ బ్లాక్ బస్టర్ విజయంతో హైలైట్ అయిన నాగ చైతన్య, ఈసారి కొత్త కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర LLP (SVCC), సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బివిఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్ బి ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. బాపినీడు సమర్పిస్తున్నారు.

కిరణ్ రావు దర్శకత్వంలో వచ్చిన లాపతా లేడీస్ ద్వారా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న స్పర్ష్ శ్రీవాస్తవకు ఇది తెలుగు ఇండస్ట్రీలో ఫస్ట్ స్టెప్. మేకర్స్ ఆయన పాత్రను పాత్-బ్రేకింగ్‌గా అభివర్ణించారు.

“NC24 – The Excavation Begins” ఫస్ట్ గ్లింప్స్ విడుదలైన వెంటనే భారీ చర్చకు దారితీసింది. సినిమా స్కేలు, ఇంటెన్స్ టోన్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. మిస్టరీ, ఎమోషన్, గ్రాండ్ విజువల్స్ కలగలిపిన ఈ సినిమా జానర్ డిఫైనింగ్ మైథికల్ థ్రిల్లర్‌గా నిలుస్తుందని యూనిట్ నమ్మకంగా చెబుతోంది.

హైదరాబాద్‌లో వేసిన భారీ సెట్‌లో వచ్చే నెల నుంచి నెక్స్ట్ షెడ్యూల్ జరగనుంది. సినిమాకి సంబంధించిన మరిన్ని అప్‌డేట్స్ త్వరలో రానున్నాయి.

తారాగణం: నాగ చైతన్య, స్పర్ష్ శ్రీవాస్తవ
Young star Naga Chaitanya is teaming up with Virupaksha director Karthik Dandu for the mythological thriller #NC24. Lapataa Ladies fame Sparsh Shrivastava joins the cast in a key role, marking his debut in Telugu cinema.

After the blockbuster success of Tandel, Naga Chaitanya is now set to return with a fresh concept. The film is being produced on a grand scale under the banners of Sri Venkateswara Cine Chitra LLP (SVCC) and Sukumar Writings by BVSN Prasad and Sukumar B, with Bapineedu presenting it.

Sparsh Shrivastava, who gained nationwide recognition with Kiran Rao’s Lapataa Ladies, is making his first step into the Telugu industry with this film. The makers described his role as path-breaking in his career.

The first glimpse titled “NC24 – The Excavation Begins” created huge buzz upon release. Its grand scale and intense tone impressed fans and movie lovers alike. With a mix of mystery, emotion, and striking visuals, the makers are confident the film will stand out as a genre-defining mythological thriller.

The next shooting schedule will begin next month on a specially erected massive set in Hyderabad. More exciting updates about the film will follow soon.

Cast: Naga Chaitanya, Sparsh Shrivastava

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *