Annamayya district police urged youth to stay away from drugs and contribute to national development.

యువత డ్రగ్స్ దూరంగా ఉండి దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలి అని అన్నమయ్య జిల్లాలో పోలీస్ శాఖ పిలుపునిచ్చింది. రాయచోటి శ్రీ సాయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్‌లో “ఈగల్ సెల్” ఆధ్వర్యంలో డ్రగ్స్ వ్యతిరేక అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. విద్యార్థులు డ్రగ్స్ రహిత భవిష్యత్తుకు ప్రతిజ్ఞ చేశారు.
Annamayya district police urged youth to stay away from drugs and contribute to national development. At Sri Sai Institute of Technology and Science, Rayachoti, an anti-drug awareness program under “Eagle Cell” was conducted, with students pledging to stay drug-free.
ఈ కార్యక్రమాన్ని రాయచోటి డీఎస్పీ ఎం.ఆర్. కృష్ణమోహన్ పర్యవేక్షించగా, జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాల మేరకు నిర్వర్తించారు. డీఎస్పీ మత్తు పదార్థాల వినియోగం ఒక వ్యక్తి మాత్రమే కాకుండా, కుటుంబాన్ని, సమాజాన్ని కూడా క్షీణతపరిచే ప్రభావం చూపుతుందని తెలిపారు. డ్రగ్స్ రవాణా లేదా వినియోగం చేస్తే ఎదురయ్యే కఠినమైన శిక్షల గురించి విద్యార్థులను అవగాహన పరుచారు.
The program was supervised by Rayachoti DSP M.R. Krishnamohan under the guidance of District SP Dheeraj Kunubilli. The DSP highlighted that drug consumption affects not just an individual but also families and society, and explained strict penalties under the law for possession or use of drugs.
విద్యాసంస్థల పరిసరాల్లో డ్రగ్స్ రహిత వాతావరణాన్ని కల్పించేందుకు ‘ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్’ అమలు చేస్తోందని, విద్యార్థులు స్వచ్ఛందంగా డ్రగ్స్ నియంత్రణలో భాగస్వాములు కావడానికి ‘ఈగల్ క్లబ్స్’ పనిచేస్తున్నట్లు తెలిపారు. సుమారు 300 మంది విద్యార్థులు “డ్రగ్స్‌కు చెక్… ఈగల్ తో సేఫ్!”, “దేశాన్ని ప్రేమిద్దాం – డ్రగ్స్‌ను ద్వేషిద్దాం” అంటూ ప్రతిజ్ఞ చేశారు. విద్యార్థులందరి సెల్ ఫోన్లలో ఈగల్ సెల్ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌లను సబ్‌స్క్రైబ్ చేయించి, డ్రగ్స్ నివారణపై నిరంతరం అప్‌డేట్స్ పొందేలా చేశారు.
To promote a drug-free environment on campuses, the “Operation Safe Campus Zone” is being implemented, with students actively participating through “Eagle Clubs.” Around 300 students pledged slogans like “Check Drugs… Stay Safe with Eagle!” and “Love the Nation – Reject Drugs.” They subscribed to Eagle Cell social media platforms for continuous updates on drug prevention.
ఈ కార్యక్రమంలో రాయచోటి టౌన్ ఇన్‌స్పెక్టర్ బి.వి. చలపతి, ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ కుళాయప్ప, కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపక బృందం, శక్తి టీమ్ మరియు ఈగల్ టీమ్ సభ్యులు పాల్గొన్నారు.
The event was attended by Rayachoti Town Inspector B.V. Chalapati, Traffic Inspector Kulayappa, the college principal, faculty members, Shakti Team, and Eagle Team staff.