మోడీ విషయంలో కేసీఆర్‌ మెత్తబడుతున్నారా .. !!

హైదరాబాద్‌ : ప్రధాని మోడీ అంటే చాలు.. ఒంటికాలిపై లేచిన తెలంగాణ సీఎం కేసీఆర్‌ బెండ్‌ అయిపోయారా? మోడీ విషయంలో సర్దుకు పోవాలనే వ్యూహంతోనే ముందుకు సాగుతున్నారా? అంటే.. తాజా పరిణామాలను బట్టి ఔననే అంటున్నారు పరిశీలకులు. నిన్న మొన్నటి వరకు మూడు రైతు చట్టాలు ధాన్యం కొనుగోళ్లు అప్పులు ఇవ్వకపోవడం.. రాష్ట్రంలో అభివృద్ధి చేపట్టకపోవడం.. రాష్ట్రానికి మెడికల్‌ కాలేజీలు ఇవ్వక పోవడం వంటి అనేక అంశాలతో కేసీఆర్‌ మోడీని వ్యతిరేకించారు.
ఈ క్రమంలోనే ఆయన బీఆర్‌ ఎస్‌ పార్టీతో కేంద్రంలో చక్రం తిప్పేందుకు రెడీ అయ్యారు. నోరు విప్పితే చాలు.. మోడీపై విరుచుకుపడ్డారు. బీజేపీపై నిప్పులు చెరిగారు. అయితే..ఢల్లీి లిక్కర్‌ కుంభకోణంలో ఆయన కుమార్తె కవిత సహా కొందరి పేర్లు బయటకు రావడం.. సీబీఐ దూకుడు పెంచడం.. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని టెన్షన్‌ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో వెనక్కి తగ్గినట్టు చర్చ జరుగుతోంది. మోడీపై ఇటీవల వరకు కారాలు మిరియాలు నూరిన కేసీఆర్‌.. కీలక సమయంలో వెనుకడుగు వేయడం మరింత సంచలనంగా మారింది.
ఇప్పటి వరకు మోడీకి వ్యతిరేకంగా అన్ని పార్టీలూకలిసి రావాలని పిలుపునిచ్చిన కేసీఆర్‌.. తాజాగా అన్ని పార్టీలు మోడీపై కదనానికి కాలు దువ్విన నేపథ్యంలో మౌనంగా ఉన్నారు. పార్లమెంటు కొత్త భవనం ప్రా రంభోత్సవాన్ని వ్యతిరేకిస్తూ(మోడీ చేయడాన్ని) 19 విపక్ష పార్టీలు చేతులు కలిపాయి. మరి వీటితోకలిసి ముందుకు సాగుతారని అనుకున్నప్పటికీ.. కేసీఆర్‌ మౌనంగా ఉండిపోయారు.అంతేకాదు.. పార్లమెంట్‌ కొత్త భవనం ప్రారంభోత్సవంలో పాల్గొనాలా..? లేక ఆ కార్యక్రమాన్ని బహిష్కరిం చాలా..? అనే దానిపై తాము రేపు నిర్ణయించుకుంటామని బీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నేత కె. కేశవరావు చెప్పడం ఆసక్తిగా మారింది. అంటే.. పరిస్థితులు తమకు అనుకూలంగా ఉంటే.. ఒక విధంగా..ఏమాత్రం వ్యతిరేకంగా ఉన్నా.. మరోలా రియాక్ట్‌ అయ్యేందుకు కేసీఆర్‌ పథక రచన చేస్తున్నారనే టాక్‌ వినిపిస్తుం డడం గమనార్హం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *