మే 4 నుండి 12వ తేదీ వరకు నాగలాపురం శ్రీ వేదనారాయణస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు తిరుపతి

టీటీడీకి చెందిన నాగలాపురంలోని శ్రీ వేదవల్లీ సమేత శ్రీ వేదనారాయణ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు మే 4 నుండి 12వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. మే 2న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం, 3న అంకురార్పణం నిర్వహిస్తారు.
వాహనసేవల వివరాలు ఇలా ఉన్నాయి. ఉదయం 8 నుంచి 9.30 గంటల వరకు, రాత్రి 7 నుంచి 8.30 గంటల వరకు వాహనసేవలు జరుగుతాయి.
04052023 ధ్వజారోహణం పెద్దశేష వాహనం
05052023 చిన్నశేష వాహనం హంస వాహనం
06052023సింహ వాహనం ముత్యపుపందిరి వాహనం
07052023 కల్పవృక్ష వాహనం సర్వభూపాల వాహనం 08052023 మోహినీ అవతారం గరుడ వాహనం 09052023 హనుమంత వాహనం గజ వాహనం 10052023 సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం 11052023 రథోత్సవం, ఆర్జితకల్యాణోత్సవం అశ్వవాహనం 12052023 చక్రస్నానం ` ధ్వజావరోహణం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *