
మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మన శంకరవరప్రసాద్ గారు వినాయక చవితి సందర్భంగా కొత్త ట్రెడిషనల్ పోస్టర్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంది.
Megastar Chiranjeevi and Anil Ravipudi’s much-awaited family entertainer Mana Shankaravara Prasad Garu grabbed attention with a festive traditional poster released on Vinayaka Chavithi.
హిట్ మెషిన్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను సాహు గారపాటి, సుస్మిత కొణిదెల షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. అర్చన సమర్పిస్తున్నారు. టైటిల్, ఫస్ట్ లుక్ గ్లింప్స్ ఇప్పటికే భారీ హంగామా సృష్టించాయి. “పండగకి వస్తున్నారు” అనే ట్యాగ్‌లైన్‌తో సినిమా హైప్ పెంచింది.
వినాయక చవితి సందర్భంగా విడుదలైన కొత్త పోస్టర్‌లో చిరంజీవి పట్టు చొక్కా, పట్టు పంచె, కండువా, స్టైలిష్ షేడ్స్‌తో ఓ షిప్ డెక్క్ మీద కనిపించారు. సాంప్రదాయం, మెగాస్టార్ స్టైల్ కలిసిన ఈ లుక్ ఫ్యాన్స్‌కి ఫెస్టివ్ ట్రీట్‌గా నిలిచింది.
ఫ్యాన్ బాయ్ అయిన అనిల్ రావిపూడి, చిరంజీవిని అభిమానులు ఎలా చూడాలనుకుంటారో అలా ఒక అద్భుతమైన పాత్రలో చూపిస్తున్నారని యూనిట్ చెబుతోంది. హీరోయిన్‌గా నయనతార నటిస్తోంది. సినిమాటోగ్రఫీ సమీర్ రెడ్డి, సంగీతం భీమ్స్ సిసిరోలియో అందిస్తున్నారు. ఎడిటింగ్ తమ్మిరాజు, ఆర్ట్ డైరెక్షన్ ఏఎస్ ప్రకాష్ చేస్తున్నారు. ఎస్. కృష్ణ, జి. ఆది నారాయణ సహ రచయితలుగా, ఎస్. కృష్ణ ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా పనిచేస్తున్నారు.
మన శంకరవరప్రసాద్ గారు 2026 సంక్రాంతి కానుకగా థియేటర్స్‌లో విడుదల కానుంది.
తారాగణం: చిరంజీవి, నయనతార, వీటీవీ గణేష్