Chief Minister N. Chandrababu Naidu met Microsoft co-founder Bill Gates in Amaravati and presented the Swarna Andhra Vision 2047 roadmap and key governance initiatives.

అమరావతి పర్యటన సందర్భంగా Bill Gates సచివాలయంలో మంత్రులు, ఉన్నతాధికారులతో కలిసి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి N. Chandrababu Naidu స్వర్ణాంధ్ర విజన్ 2047, ప్రభుత్వ విధానాలు, లక్ష్యాలు, కార్యక్రమాలపై సమగ్ర ప్రజెంటేషన్ అందించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు Bill & Melinda Gates Foundation మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం రాష్ట్ర అభివృద్ధికి కొత్త దశను తీసుకువస్తుందని తెలిపారు. 1997లో బిల్ గేట్స్‌ను తొలిసారి కలిసిన సందర్భాన్ని గుర్తుచేసుకుంటూ, హైదరాబాద్లో Microsoft స్థాపనతో ఐటీ రంగంలో వచ్చిన మార్పులను ప్రస్తావించారు.
గేట్స్ పర్యటన చారిత్రాత్మకమని పేర్కొంటూ, ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న వనరులను సమర్థంగా వినియోగించి సంపద సృష్టి దిశగా ముందుకు సాగుతామని తెలిపారు. 10 సూత్రాలతో స్వర్ణాంధ్ర సాధనకు కృషి చేస్తున్నామని, స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్‌ను ప్రభుత్వ విధానంగా అమలు చేస్తున్నామని చెప్పారు.
అమరావతిని డిజైన్ అండ్ ఫౌండ్రీ, క్వాంటం వ్యాలీగా, విశాఖను డేటా-ఏఐ సిటీగా, కాకినాడను గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా, ఓర్వకల్లును డ్రోన్ సిటీగా అభివృద్ధి చేస్తున్నట్లు వివరించారు. లేపాక్షిని ఎలక్ట్రానిక్స్-ఏరో సిటీగా, తిరుపతిని ఎలక్ట్రానిక్స్-స్పేస్ సిటీగా తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో 10 రంగాలు, 30 ప్రభుత్వ విభాగాల్లో ఏఐ వినియోగిస్తున్నామని చెప్పారు.
విద్యా రంగంలో పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా బోధన విధానాల్లో మార్పులు చేపడుతున్నామని, వ్యవసాయం మరియు అనుబంధ రంగాలను బలోపేతం చేస్తున్నామని పేర్కొన్నారు. రైతు సంక్షేమానికి సాంకేతిక సహకారం తీసుకుంటున్నామని తెలిపారు. ప్రజారోగ్య సేవల మెరుగుదల కోసం నిపుణుల సలహా మండలి ఏర్పాటు చేసి, యూనివర్సల్ హెల్త్ స్క్రీనింగ్ విధానంతో ముందస్తు వైద్య సేవలు అందిస్తున్నామని, తక్కువ ఖర్చుతో వైద్య పరీక్షలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.
The Chief Minister stated that technology-driven governance, sector-wise development hubs, and collaboration with the Gates Foundation would accelerate Andhra Pradesh’s growth trajectory under Vision 2047.