‘మిరాయ్’లో పవర్‌ఫుల్ క్యారెక్టర్ చేసిన మనోజ్ మంచు, ఇది తన కంబ్యాక్ ఫిల్మ్ అవుతుందని విశ్వాసం వ్యక్తం చేశాడు..Manoj

‘మిరాయ్’లో పవర్‌ఫుల్ క్యారెక్టర్ చేసిన మనోజ్ మంచు, ఇది తన కంబ్యాక్ ఫిల్మ్ అవుతుందని విశ్వాసం వ్యక్తం చేశాడు. సెప్టెంబర్ 12న విడుదల కానున్న ఈ చిత్రం పాన్-ఇండియా స్థాయిలో భారీ అంచనాలు సృష్టిస్తోంది.

Manoj Manchu said his role in Mirai is powerful and expressed confidence that it will mark his comeback. The film, releasing on September 12, is creating huge buzz as a pan-India visual wonder.

సూపర్ హీరో తేజ సజ్జా నటిస్తున్న పాన్-ఇండియా విజువల్ వండర్ మిరాయ్ను కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో రాకింగ్ స్టార్ మనోజ్ మంచు కీలక పాత్ర పోషించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే గ్లింప్స్, టీజర్, ట్రైలర్ భారీ రెస్పాన్స్ తెచ్చాయి.

ప్రెస్ మీట్‌లో మాట్లాడుతూ మనోజ్ మంచు – “నా పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. లేజీగా బ్రతికేవాడు బ్రతకకూడదనే రకమైన క్యారెక్టర్. ఇది మోడర్న్ రావణ పాత్రలా అనిపించవచ్చు కానీ స్త్రీల జోలికి వెళ్లదు. ఈ సినిమా నా కంబ్యాక్ అవుతుంది. దర్శకుడు కార్తీక్ గొప్ప టెక్నీషియన్. ఆయన అనుభవంతో ఈ సినిమాని హాలీవుడ్ స్థాయిలో తీశారు” అని తెలిపారు.

అలాగే రజనీకాంత్‌ను కలిసిన విషయాన్ని పంచుకున్న మనోజ్ – “మిరాయ్ ట్రైలర్ చూపించాను. ఆయన చాలా ఎంకరేజ్ చేశారు, గ్యాప్ లేకుండా సినిమాలు చేయమని చెప్పారు” అన్నారు. ఈ సినిమా కోసం ఆయన ప్రత్యేకంగా యాక్షన్ శిక్షణ తీసుకున్నట్లు వెల్లడించారు.

తేజ సజ్జా కష్టపడి పనిచేసినట్లు ప్రశంసించిన మనోజ్, “సినిమాలో ఆయన హార్డ్ వర్క్ స్పష్టంగా కనిపిస్తుంది” అన్నారు. నిర్మాత విశ్వప్రసాద్‌ గ్రాండ్ విజన్ కారణంగానే ఈ స్థాయి సినిమాగా రూపుదిద్దుకుందని అన్నారు.

ట్రైలర్‌కు తన కెరీర్‌లోనే అత్యధిక రెస్పాన్స్ వచ్చిందని, ప్రపంచం నలుమూలల నుంచి స్పందన రావడం ఆనందంగా ఉందని ఆయన పేర్కొన్నారు.

భవిష్యత్ ప్రాజెక్టుల గురించి మాట్లాడుతూ – “డేవిడ్ రెడ్డి, రక్షక్ వంటి హై ఇంటెన్సిటీ యాక్షన్ సినిమాలు చేస్తున్నాను. తమిళ్ నుంచీ కూడా ఆఫర్లు ఉన్నాయి. ఒక నటుడిగా అన్ని భాషల్లో నటించాలని ఉంది” అని తెలిపారు. అదనంగా అహం బ్రహ్మాస్మి, వాట్ ది ఫిష్ ప్రాజెక్టుల గురించి కూడా వివరించారు.

Manoj Manchu said his role in Mirai is very powerful and expressed confidence that this will be his comeback film. Scheduled for a grand release on September 12, the film is generating massive buzz as a pan-India visual wonder.

Directed by Karthik Ghattamaneni, Mirai stars superhero Teja Sajja in the lead, with Rocking Star Manoj Manchu playing a key role. The film is produced by TG Vishwa Prasad and Krithi Prasad under People Media Factory. Glimpses, teaser, and trailer have already received huge response.

Speaking at a press meet, Manoj said – “My character is extremely powerful. It’s designed as someone who cannot afford to live lazily. One may even call it a modern-day Ravana, but the role does not involve troubling women. This film is definitely my comeback. Director Karthik is a brilliant technician. With his vision, he has made this film at Hollywood standards.”

Sharing his experience of meeting Rajinikanth, Manoj revealed – “I showed him the Mirai trailer. He loved it and encouraged me to continue doing films without taking breaks. His words gave me great energy.” He added that he underwent special training for action sequences and also had a background in martial arts since childhood.

Praising Teja Sajja’s efforts, Manoj said, “Teja worked very hard for the film, and the audience will see his dedication clearly on screen.” He also credited producer Vishwa Prasad for mounting the film on such a grand scale without any compromises.

Calling Mirai’s trailer the highest response of his career, Manoj said global reactions have been overwhelming. “I will always be grateful to the director for giving me such a role,” he added.

On future projects, he said – “I’m working on David Reddy and Rakshak, both high-intensity action films. I also have offers from Tamil cinema. As an actor, I want to explore all languages. Aham Brahmasmi will release at the right time, and What the Fish will be a dark comedy shot abroad. I’m also planning a project with the Nenu Meeku Telusa team. An official announcement will be made soon.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *