మాలీలో ముగ్గురు భారతీయులు కిడ్నాప్ – ఇద్దరు తెలుగువారు, కేంద్రం స్పందన
Three Indian nationals, including two from Telugu states, were abducted by terrorists in Mali during an armed attack on a cement factory, creating alarm across diplomatic channels. The Ministry of External Affairs confirmed that an al-Qaeda-linked terrorist group was behind the abduction and stated that rescue efforts are underway.

The image screen short is used from Hindustan Times (used in fair way and for the purpose of news only)
పశ్చిమ ఆఫ్రికాలోని మాలీలో జులై 1న తీవ్ర కలకలం రేగింది. కాయెస్ ప్రాంతంలోని డైమండ్ సిమెంట్ ఫ్యాక్టరీపై ఉగ్రవాదులు దాడి చేసి అక్కడ పనిచేస్తున్న ముగ్గురు భారతీయులను కిడ్నాప్ చేశారు. కిడ్నాప్‌కు గురైన వారిలో రమణ (ఆంధ్రప్రదేశ్) మరియు అమరలింగేశ్వర్ (తెలంగాణ, మిర్యాలగూడ) ఇద్దరు తెలుగువారు కాగా, మూడో వ్యక్తి మహారాష్ట్రకు చెందిన ఫ్యాక్టరీ జనరల్ మేనేజర్ జోషి. వీరిని తుపాకులతో బెదిరించి తీసుకెళ్లారు.
భారత విదేశాంగశాఖ ప్రకారం, ఈ దాడికి అల్‌ఖైదాతో అనుబంధమున్న నిషేధిత జమాత్ నుస్రత్ అల్ ఇస్లాం వాల్ ముస్లిమిన్ (JNIM) ఉగ్రవాద సంస్థ బాధ్యత వహించింది. మాలీలోని భారత రాయబార కార్యాలయం స్థానిక అధికారులతో చర్చలు జరుపుతోంది. బాధిత కుటుంబాలతో సంబంధాలు కొనసాగిస్తూ వారిని వీలైనంత త్వరగా విడిపించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది.
భారత ప్రభుత్వం ఈ ఘటనను తీవ్రంగా ఖండించింది. బందీలను సురక్షితంగా విడుదల చేయాలని మాలీ ప్రభుత్వాన్ని కోరింది. మాలీలోని భారతీయులకు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. బాధితుల కుటుంబాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. “వారు ఏ పరిస్థితుల్లో ఉన్నారో తెలియదు. చిత్రహింసలకు గురవుతారా అనే భయం కంటగించిపోతోంది,” అని వారు పేర్కొంటున్నారు.