Apple is likely to unveil the affordable iPhone 17e along with other products at the ‘Special Apple Experience’ event scheduled for March 4, according to reports.

టెక్ ప్రపంచంలో మరో ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. Apple Inc. తన తదుపరి తరం సరసమైన ఐఫోన్ మోడల్‌ను త్వరలోనే పరిచయం చేయనున్నట్లు సమాచారం. మొదట ఫిబ్రవరి 19న లాంచ్ చేయాలని భావించిన ఐఫోన్ 17e విడుదల ఇప్పుడు వాయిదా పడింది. తాజా నివేదికల ప్రకారం మార్చి 4న జరగనున్న ‘స్పెషల్ ఆపిల్ ఎక్స్పీరియన్స్’ ఈవెంట్లో ఈ మోడల్‌ను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.
డిజైన్, డిస్ప్లే వివరాలు:
ఐఫోన్ 17e 6.1 అంగుళాల OLED డిస్ప్లేతో రానుంది. 60Hz రిఫ్రెష్ రేట్, గరిష్టంగా 2,000 నిట్స్ బ్రైట్నెస్ సపోర్ట్ ఉంటుందని సమాచారం. డైనమిక్ ఐలాండ్ ఫీచర్ కూడా అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ఫ్రంట్ డిజైన్ iPhone 15 మాదిరిగా ఉండగా, బ్యాక్ డిజైన్ iPhone 16e తరహాలో కనిపించవచ్చని అంచనా. బ్లాక్, వైట్‌తో పాటు లావెండర్ లేదా పర్పుల్ కలర్ వేరియంట్లు అందుబాటులోకి రావచ్చు.
పర్ఫార్మెన్స్, సాఫ్ట్వేర్:
ఐఫోన్ 17e లో కొత్త A19 చిప్సెట్ ఉండే అవకాశముంది. ఇది 3nm ప్రాసెస్‌పై ఆధారపడి పనిచేయవచ్చని టెక్ వర్గాలు చెబుతున్నాయి. మెరుగైన 5G కనెక్టివిటీ కోసం C1X మోడెమ్, N1 చిప్‌లను అందించే అవకాశం ఉంది. ఆపిల్ ఇంటెలిజెంట్ ఫీచర్ల కోసం 8GB ర్యామ్ ఇవ్వొచ్చని సమాచారం. పనితీరు పరంగా ఇది ప్రీమియం మోడళ్లకు సమీపంగా ఉండొచ్చని అంచనా.
కెమెరా, బ్యాటరీ (అంచనా):
రియర్ సైడ్‌లో 48MP సింగిల్ ఫ్యూజన్ కెమెరా ఉండే అవకాశం ఉంది. 4K వీడియో రికార్డింగ్‌కు సపోర్ట్ అందించవచ్చు. సెల్ఫీ కోసం 18MP సెంటర్ స్టేజ్ కెమెరా ఉండొచ్చని సమాచారం. బ్యాటరీ సామర్థ్యం సుమారు 4,005mAh ఉండవచ్చని అంచనా. ఇది ప్రస్తుత మోడళ్లతో పోలిస్తే కొంత మెరుగ్గా ఉండే అవకాశం ఉంది.
ధర వివరాలు (అంచనా):
భారత మార్కెట్లో 128GB బేస్ వేరియంట్ ధర సుమారు రూ. 59,900గా ఉండవచ్చని నివేదికలు సూచిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ప్రారంభ ధర 599 డాలర్లుగా ఉండొచ్చు. పోటీ పరంగా చూస్తే, ఇటీవల విడుదలైన Google Pixel 10a మోడల్‌తో నేరుగా పోటీ పడే అవకాశం ఉంది. ఆ పిక్సెల్ 10a భారత మార్కెట్లో సుమారు రూ. 49,900 ధరకు లాంచ్ అయింది.
అధికారిక ప్రకటన వెలువడే వరకు పూర్తి స్పెసిఫికేషన్లు, ధరపై స్పష్టత రానున్న రోజుల్లో తెలుస్తుంది.
In a significant development in the tech world, Apple Inc. is reportedly preparing to introduce its next-generation affordable iPhone model. The company had initially planned to launch the iPhone 17e on February 19, but the release was later postponed. Recent reports suggest that the official announcement could take place during the March 4 special event.
Design and Display:
The iPhone 17e is expected to feature a 6.1-inch OLED display with support for a 60Hz refresh rate and up to 2,000 nits of peak brightness. It may also include the Dynamic Island feature. The front design is likely to resemble the iPhone 15, while the rear design could be similar to the iPhone 16e. Color options may include Black, White, and Lavender or Purple finishes.
Performance and Software:
The device is rumored to be powered by Apple’s new A19 chipset, built on a 3nm process. It may also feature the C1X modem and N1 chip to enhance 5G connectivity and power efficiency. For improved Apple Intelligence features, the smartphone is expected to come with 8GB of RAM. Performance-wise, it could offer near-premium experience at a relatively affordable price.
Camera and Battery (Expected):
On the rear, the iPhone 17e may include a 48MP single Fusion camera sensor with support for 4K video recording. For selfies and video calls, it is expected to offer an 18MP Center Stage front camera. The battery capacity is estimated to be around 4,005mAh, potentially larger than some previous base models.
Expected Price:
In the Indian market, the 128GB base variant is likely to be priced at approximately ₹59,900. Globally, the starting price could be around $599. In terms of competition, it is expected to rival the recently launched Google Pixel 10a, which debuted in India at around ₹49,900.
An official confirmation from Apple is awaited for final specifications and pricing details.