
మాదక ద్రవ్యాల కేసులపై కఠినంగా వ్యవహరించాలి
మంత్రి పొన్నం
హైదరాబాద్
జలవిహార్ లో మాదకద్రవ్య దుర్వినియోగం & అక్రమ రవాణాకు వ్యతిరేక అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రులు మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా పోస్టర్ లను ఆవిష్కరించారు. మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా జరిగిన ర్యాలీలో పాల్గొన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బిర్ల ఐలయ్య ,జీహెచ్ ఎంసీ మేయర్ గద్వాల విజయ లక్ష్మీ, కార్పోరేషన్ చైర్మన్ లు మెట్టు సాయికుమార్ ,వీరయ్య, జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ,సందీప్ శాండల్య తెలంగాణ యాంటి నార్కోటిక్స్ బ్యూరో డైరెక్టర్ జనరల్ ,అనితా రామచంద్రన్ ఐఏఎస్, శైలజ ఐఏఎస్, హైదరాబాద్ సిపి సివి ఆనంద్,రాచకొండ సిపి సుధీర్ బాబు, హీరో నిఖిల్ తదితరులు పాల్గోన్నారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ భవిష్యత్తులో లో మన సమాజాన్ని కాపాడటానికి సంకల్పం తీసుకోవడమే ఈ కార్యక్రమం. శాంతి భద్రతల అదుపులో ఏ అంశాలనైన పక్కన పెట్టవచ్చు కాని మాదకద్రవ్యాల కేసు వస్తే రెండో ఆలోచన లేకుండా కఠినంగా వ్యవహరించాలని అన్నారు.
ఈ ప్రపంచంలో పరిస్థితులు ఉన్నాయి క్షేత్రస్థాయిలో చెడుకు తొందరగా అలవాటు పడుతున్నారు. తప్పుడుకు తొందరగా, మంచికి చాలా ఆలస్యంగా ఎట్రాక్ట్ అవుతున్నారు . డ్రగ్స్ ఎవరు తీసుకోము, ఎవరు తీసుకున్న వారి వివరాలను పోలీస్ శాఖకు తెలియజేస్తామన్న ప్రతిజ్ఞను తీసుకోవాల్సిన అవసరం ఉంది. మొదటి థ్రిల్ గా అనిపిస్తుంది కాని అలవాటుగా మారితే జీవితాలు చెడిపోతాయి. ప్రస్తుతం శత్రువులు యువతపై దాడులు చేయాల్సిన అవసరం లేదు, చెడు వ్యసనాలు అలవాటు చేస్తే చాలు భవిష్యత్తు మొత్తం అంధకారంలోకి మారుతుం. పిల్లల భవిష్యత్తుపై ఆటలు ఆడే వారి పట్ల సమాజం కఠినంగా వ్యవహరించి, బహిష్కరించాల్సిన అవసరం ఉందని అన్నారు.