మహీంద్రా XUV 3XO పై భారీ డిస్కౌంట్ – భారత్‌లో కాకుండా ఆస్ట్రేలియాలో గర్రీ గొడవ

మహీంద్రా XUV 3XO పై భారీ డిస్కౌంట్ – భారత్‌లో కాకుండా ఆస్ట్రేలియాలో గర్రీ గొడవ

Mahindra surprises auto enthusiasts with a massive price cut of ₹4 lakh on its compact SUV XUV 3XO—but the offer is limited to the Australian market. The model is now available at just AUD 23,490 (approx. ₹13.18 lakh), making it one of the most affordable Mahindra SUVs in Australia.

భారత్‌లో XUV700, స్కార్పియో, థార్ వంటి బ్లాక్‌బస్టర్ SUVలతో జోరు కొనసాగిస్తున్న మహీంద్రా.. ఇప్పుడు XUV 3XO మోడల్‌ను ఆస్ట్రేలియా మార్కెట్‌లో భారీ ధర తగ్గింపుతో లాంచ్ చేసింది. రెండు వేరియంట్లుగా (AX5 L, AX7 L) మాత్రమే లభించే ఈ కారు పైగా సుమారు ₹4 లక్షలు తగ్గించి విక్రయిస్తోంది.

భారత మార్కెట్‌తో పోలిస్తే XUV 3XO కి ఉన్న డిఫరెన్సులూ విశేషమే. ఇక్కడ మూడు ఇంజన్ ఆప్షన్లతో వస్తే, ఆస్ట్రేలియన్ వెర్షన్‌లో కేవలం 1.2L MPFi టర్బో పెట్రోల్ ఇంజన్ మాత్రమే ఉంది. డీజిల్ వేరియంట్ అక్కడ అందుబాటులో లేదు. కానీ, ఫీచర్ల విషయంలో మాత్రం తగ్గే ప్రసక్తి లేదు—పనోరమిక్ సన్‌రూఫ్, డ్యూయల్ 10.25-అంగుళాల స్క్రీన్, 360° కెమెరా వంటి హై-ఎండ్ టెక్నాలజీ అదిరిపోతుంది.

అంతేకాదు, ఆస్ట్రేలియన్ మార్కెట్‌లో మాజ్డా CX-3, హ్యుందాయ్ వెన్యూ, కియా స్టోనిక్ వంటి గట్టి పోటీదారుల మధ్యకి మహీంద్రా దూసుకెళ్తోంది. స్టైలిష్ డిజైన్, బలమైన ఫీచర్లు, అతి తక్కువ ధర — ఇవన్నీ కలిసి XUV 3XOను అక్కడ హాట్ సెల్లింగ్ SUVగా నిలబెట్టనున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *