మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం అబ్బాయి పాలెం గ్రామంలో ఏర్పాటుచేసిన సొసైటీ ధాన్యం కొనుగోలు కేంద్రంలో నెలరోజులు గడిచిన వరి ధాన్యం కొనుగోలు చేసిన లారీలు రావడంలేదని సొంత వాహనాలలో మిల్లుకు తీసుకొని పోతే 10 కేజీలు కటింగ్ పేరుతో దోపిడీ చేస్తున్నారని రైతులు 365 నేషనల్ హైవే విూద ముళ్లకంచలు వేసి రోడ్డు దిగ్బంధం చేశారు.సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.వరి ధాన్యానికి నిప్పు పెట్టి నిరసన వ్యక్తం చేశారు.భారీగా వాహనాలు నిలిచిపోవడంతో పోలీసులు వచ్చి రైతులకు సర్ధి చెప్పి ముళ్ళకంపలను తొలగించి రోడ్డు క్లియర్ చేశారు.అధికారులతో మాట్లాడుతూ న్యాయం చేస్తామని పోలీసులు చెప్పడంతో ఆందోళన విరమించారు.