మరో సంచలనానికి తెరలేపిన రిలయన్స్‌ జియోరూ. 999 లకే జియోభారత్‌ 4జి ఫోన్‌ను… జూలై 7 నుంచి మార్కెట్లోకి 1 మిలియన్‌ జియో భారత్‌ 4జీ ఫోన్లు…

ముంబాయ్‌ : రిలయన్స్‌ జియో మరో సంచలనానికి తెరలేపింది. జియోభారత్‌ 4జి ఫోన్‌ను భారత్‌లో విడుదల చేసింది. 2జీ నుంచి 4జీకి ప్రమోట్‌ చేసే క్రమంలో ‘జియో భారత్‌’ పేరుతో ఈ ఫోన్‌ లాంచ్‌ చేసింది. కార్బన్‌ కంపెనీ భాగస్వామ్యంలో అందుబాటులో తీసుకొచ్చింది. దీని ధర రూ. 999గా నిర్ణయించింది. జూలై 7 నుంచి 1 మిలియన్‌ జియో భారత్‌ 4జీ ఫోన్లు మార్కెట్లోకి విక్రయించనుంది. 28 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. 14 జీబీ డేటా (రోజుకు 0.5జీబీ) వస్తుంది. అదే సంవత్సరానికి అయితే 1234తో రీఛార్జ్‌ చేయాల్సి ఉంటుంది. రోజుకు 0.5 జీబీ చొప్పున మొత్తం 168జీబీ డేటా లభిస్తుంది.గా.. దేశంలో ఇప్పటివరకు 25 కోట్లమంది జియో మొబైల్స్‌ వాడుతున్నారని రిలయన్స్‌ జియో చైర్మన్‌ ఆకాష్‌ అంబానీ తెలిపారు. ప్రతి ఒక్కరికీ ఇంటర్నెట్‌ అందించాలని జియో లక్ష్యంగా పెట్టుకుందన్నారు. అందులో భాగంగానే జియో భారత్‌ను తీసుకొచ్చినట్లు తెలిపారు. ఈ మొబైల్‌కు నెలకు రూ.123 రీఛార్జ్‌ చేయాల్సి ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *