హైదరాబాద్ : తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. మంత్రి కేటీఆర్ పైన ఛాలెంజ్ విసిరే క్రమంలో ఆయన ఫ్లోలో చేసిన వ్యాఖ్యలు రేవంత్ కు ఇబ్బందులు తెచ్చి పెట్టాయి. దొమ్మర సామాజికవర్గం పట్ల రేవంత్ రెడ్డి కించపరిచే వ్యాఖ్యలు చేశారని, ఆ సామాజిక వర్గానికి చెందిన వారు ఆరోపిస్తున్నారు. రేవంత్ వ్యాఖ్యలను ఖండిస్తూ రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ దిష్టి బొమ్మలను ఊరూరా ఊరేగించారు. చెప్పుదెబ్బలతో నిరసన వ్యక్తం చేయాలని తెలంగాణ రాష్ట్ర దొమ్మరుల సంఘం, తెలంగాణ సంచార జాతుల సంఘాల నిర్ణయం తీసుకున్నాయి.రేవంత్ తన వ్యాఖ్యలను 24 గంటల్లోగా వెనక్కి తీసుకుని తెలంగాణ రాష్ట్ర దొమ్మర సమాజానికి భేషరతుగా క్షమాపణ చెప్పాలని ఆ సంఘం డిమాండ్ చేసింది. లేని పక్షంలో దొమ్మరలతో రేవంత్ రెడ్డికి చెప్పు దెబ్బలతో సమాధానం చెప్పడంతో పాటు కాంగ్రెస్ పార్టీ నేతలకు దొమ్మరలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. కేవలం రెడ్డి సామాజిక వర్గమే పరమావధిగా సాగుతున్న రేవంత్ రెడ్డి అహంకారానికి సబ్బండ సంచార జాతులు ఈ ఎన్నికల్లో తగిన బుద్ది చెబుతారని వారు గట్టిగా హెచ్చరించారు.‘‘ఉచిత విద్యుత్ ను కేసీఆర్ అవినీతికి వాడుకుంటున్నారని నేను చెప్పా. దీనిపై కేటీఆర్ కల్లు తాగిన కోతిలా గెంతులు వేస్తుండు.. దొమ్మరి గంతులు లెక్క. రైతు వేదికల్లో చర్చ పెట్టాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. కేటీఆర్ ఏ రైతు వేదికకు వస్తాడో చెబితే నేను అక్కడికి వస్తా.. సిరిసిల్ల, చింతమడక, గజ్వేల్ రైతు వేదికలో ఎక్కడికి రావాలో చెప్పాలి. 24 గంటల కరెంటుపై ఆధారాలతో సహా ఇద్దరం చర్చిద్దాం’’ అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల్లో దొమ్మర గంతులు అనే పదం ఆ సామాజిక వర్గానికి చెందిన వారి ఆగ్రహానికి కారణం అయింది.ఇంకా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘ప్రతి ఏటా రూ.8 వేల కోట్లు దోచుకుంటున్నారు. ఉచిత విద్యుత్ ను కేసీఆర్ అవినీతికి వాడుకుంటున్నారని నేను చెప్పా. దీనిపై కేటీఆర్ కల్లు తాగిన కోతిలా గెంతులు వేస్తుండు. రైతు వేదికల్లో చర్చ పెట్టాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. కేటీఆర్ ఏ రైతు వేదికకు వస్తాడో చెబితే నేను అక్కడికి వస్తా.. కేంద్రం తక్కువ ధరకే విద్యుత్ అందిస్తానని చెప్పినా థర్మల్ విద్యుత్ ను కేసీఆర్ తెరపైకి తెచ్చారు. దేశంలో అవసరానికి మించి విద్యుత్ ఉత్పత్తి చేసే సామర్ధ్యాన్ని పెంచింది కాంగ్రెస్. కేటీపీఎస్ 2015లో 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి 5,280 కోట్లకు టెండర్ పిలిచారు.ఉత్తరాఖండ్ లో 2400 థర్మల్ పవర్ ఉత్పత్తికి 14 వేల కోట్లకు టెండర్ పిలిచింది. ఒక మెగావాట్ 5 కోట్ల 50 లక్షలకు ఉత్పత్తి చేయొచ్చని బీహెచ్‌ఈఎల్ టెండరు దక్కించుకుంది. ఎన్టీపీసీ 1600 మెగావాట్ల ఉత్పత్తికి 10,997 కోట్లకు టెండరు పిలిచారు. 6 కోట్ల 80 లక్షలకే ఒక మెగావాట్ ఉత్పత్తి చేసేలా టెండరు వేసింది. సూపర్ క్రిటికల్ టెక్నాలజీ ద్వారానే థర్మల్ విద్యుత్ ఉత్పత్తి చేయాలని 2011`12లో చట్టం తెచ్చింది. గుజరాత్ ఇండియా బుల్స్ వద్ద కేసీఆర్, కేటీఆర్ వెయ్యి కోట్లు లంచం తీసుకుని సబ్ క్రిటికల్ టెక్నాలజీని తెచ్చుకున్నారు. దీన్ని 7,290 కోట్లకు బీహెచ్‌ఈఎల్ కు అప్పగించారు. 1080 మెగావాట్ల భద్రాద్రి థర్మల్ ప్రాజెక్టు టెండరు విలువ పెంచి ఒక మెగావాట్ ఉత్పత్తి చేసేందుకు 9 కోట్ల 70 లక్షలు ఖర్చు చేస్తున్నారు.కేసీఆర్ అవినీతి వల్ల కేటీపీఎస్ రూ.945 కోట్లు, భద్రాద్రి రూ.4,538 కోట్లు, యాదాద్రి రూ.9,384 కోట్ల నష్టం జరిగింది. మొత్తం రూ.14 వేల కోట్లకు పైగా నష్టం జరిగింది. మూడు ప్రాజెక్టులు కలిపి రూ.45వేల730 కోట్లకు టెండరు పిలిచారు. ఇందులో 30శాతం కేసీఆర్ కవిూషన్ కొట్టేశారు. ఇది 30 శాతం కవిూషన్ సర్కార్. టెండర్లలో రూ.15వేల కోట్లు నొక్కిన దొంగ కేసీఆర్. బీహెచ్‌ఈఎల్ ద్వారా కేసీఆర్ అనుయాయులకు పనులు అప్పగించారు. ప్రజలు అవినీతి గురించి ప్రశ్నిస్తారనే కేసీఆర్ బీహెచ్‌ఈఎల్ ను ముందు పెట్టారు. బీహెచ్‌ఈఎల్ నుంచి ఏ ధరకు ఏయే కంపెనీలకు పనులు అప్పగించారో బయటపెట్టాలి. కేటీఆర్, రాహుల్ గాంధీకి క్లబ్బు, పబ్బు తప్ప వ్యవసాయం తెలియదంటావా? తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ వారసుడిపై అంత మాట అంటావా? పగలుకు, రాత్రికి తేడా తెలియని నువ్వు రాహుల్ ను విమర్శిస్తావా? అసలు కేటీఆర్ కు వ్యవసాయం అంటే ఏంటో తెలుసా? దుడ్లు, బుడ్లు, బెడ్లు తప్ప కేటీఆర్ కు వ్యవసాయం తెలియదు’’ అని రేవంత్ రెడ్డి మాట్లాడారు.
RRRRRRRRRRRRRRRRRRRRRRRలీలీ