యజ్ఞ యాగాదులు ప్రకృతిని, మన సనాతన ధర్మాన్ని కాపాడుతాయని బీరంగూడలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున ఆలయంలో నిర్వహించ బడుతున్న రుద్ర సహిత చండీయాగం లో పాల్గొన్న హర్యాన గవర్నర్ బండారు దత్తాత్రేయ అభిప్రాయపడడ్డారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున ఆలయం వద్ద బిజెపి నాయకులు ఎడ్ల రమేష్ సంధ్య దంపతుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రుద్ర సహిత చండీయాగం పూజకు ముఖ్యఅతిథిగా హాజరైన హర్యాన గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఆలయ దర్శనం చేసుకొని తదనంతరం చండీయాగంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ యజ్ఞ యాగాథలు మన సంప్రదాయాన్ని సంస్కృతిని పర్యావరణాన్ని కాపాడతాయని, సనాతన ధర్మ విశిష్టతను ఈ రుద్ర సహిత చండీయాగాలు తెలియజేస్తాయని అన్నారు. మనుషులు స్వార్థం కోసం ఎన్నో పనులు చేస్తూ పర్యావరణాన్ని దెబ్బతీస్తున్నారని వాటి ప్రభావమే ఈ అకాల వర్షాలు ఈ కాలుష్యం అని అన్నారు. వీటినుండి కాపాడుకోవాలంటే యజ్ఞ యాగాలు పూజలు పెద్ద ఎత్తున జరిపించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షులు నరేందర్ రెడ్డి, నియోజకవర్గస్థాయి బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.