The murder of a seven-year-old girl in Madanapalle has triggered statewide concern, with the government assuring strict legal action against the accused

మదనపల్లిలో ఏడేళ్ల బాలిక హత్య కేసు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు దారితీస్తుండగా, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చింది.
The murder of a seven-year-old girl in Madanapalle has triggered statewide concern, with the government assuring strict legal action against the accused.
అన్నమయ్య జిల్లాలోని మదనపల్లి పట్టణంలో ఏడేళ్ల బాలికను ఓ యువకుడు హత్య చేసి మృతదేహాన్ని డ్రమ్‌లో దాచిన ఘటన తీవ్ర ఉద్రిక్తతకు కారణమైంది. చిన్నారి మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచుకుని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తూ, నిందితుడిని తమకు అప్పగించాలని లేకపోతే ఎన్‌కౌంటర్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు మాత్రం చట్టపరమైన చర్యలు కఠినంగా తీసుకుంటామని, పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని తరలించేందుకు సహకరించాలని కోరుతున్నారు.
చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రజలు, రాజకీయ పక్షాల నేతలు, ప్రజా సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. చిన్నారి తండ్రితో రాష్ట్ర హోంమంత్రి అనిత ఫోన్‌లో మాట్లాడి, నిందితుడికి ఉరిశిక్ష పడేలా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ ఘటనలో నిందితుడు కులవర్ధన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు.
In Madanapalle town of Annamayya district, a seven-year-old girl was allegedly murdered by a युवक, who concealed the body in a drum, leading to heightened tension. Family members kept the body at home in protest, demanding that the accused be handed over to them or encounter action be taken. Police urged cooperation for post-mortem procedures, assuring that strict punishment would be pursued under the law.
People, political representatives, and civil groups gathered in large numbers near the victim’s residence. State Home Minister Anitha spoke to the girl’s father over the phone, assuring that legal measures would ensure the harshest punishment for the accused. Police have taken the suspect, Kulavardhan, into custody and the investigation is ongoing.