మంత్రి లోకేష్ ప్రధాని మోడీని కలసి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, పెట్టుబడుల ప్రోత్సాహానికి సహకారం కోరారు..Minister Lokesh

మంత్రి లోకేష్ ప్రధాని మోడీని కలసి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, పెట్టుబడుల ప్రోత్సాహానికి సహకారం కోరారు.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 5:
రాష్ట్ర మంత్రి నారా లోకేష్ న్యూఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో పెట్టుబడులు ఆకర్షించడానికి కేంద్రం సహకారం అందించాలని ఆయన కోరారు. ఆంధ్రప్రదేశ్‌లో సెమీకండక్టర్ యూనిట్ మంజూరు చేసినందుకు ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో ఐటీ, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమల స్థాపనకు సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.

విద్యారంగంలో ప్రమాణాలు మెరుగుపరచడానికి అనేక సంస్కరణలు అమలు చేస్తున్నామని, ఉన్నత విద్యలో మెరుగైన ఫలితాలు సాధించేందుకు ప్రధాని మార్గదర్శనం, సహకారం అవసరమని లోకేష్ అన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత 15 నెలలుగా కేంద్రం సహకారంతో పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేశామని తెలిపారు. వికసిత్ భారత్ – 2047 లక్ష్యంలో ఆంధ్రప్రదేశ్ భాగస్వామిగా ఉంటుందని ఆయన చెప్పారు.

జీఎస్టీ సంస్కరణల ద్వారా దేశవ్యాప్తంగా కోట్లాది పేద, మధ్యతరగతి ప్రజలకు ఉపశమనం కల్పించినందుకు ప్రధానికి లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు నిరంతర సహకారం అందిస్తున్నందుకు ప్రధానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ప్రధాని మోడీ స్పందిస్తూ, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అన్నివిధాలా సహకరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా యోగాంధ్ర నిర్వహణపై రూపొందించిన కాఫీ టేబుల్ బుక్‌ను మంత్రి లోకేష్ ప్రధానికి అందజేశారు.
Minister Lokesh meets PM Modi, seeks support for AP’s investments and development.
మంత్రి లోకేష్ ప్రధాని మోడీని కలసి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, పెట్టుబడుల ప్రోత్సాహానికి సహకారం కోరారు.

New Delhi, September 5:
State Minister Nara Lokesh met Prime Minister Narendra Modi in New Delhi. He requested cooperation from the Centre to attract more investments into Andhra Pradesh. Lokesh expressed gratitude to the Union Government for sanctioning a semiconductor unit and sought further support for the establishment of IT and electronics industries in the state.

Highlighting reforms in the education sector, Lokesh said several initiatives were being implemented to improve standards and achieve better outcomes in higher education, for which he sought Modi’s guidance and support.

Lokesh further stated that since the coalition government assumed power in Andhra Pradesh, several welfare and development programs were effectively implemented with the Centre’s cooperation. He assured that Andhra Pradesh would be an active partner in the vision of “Viksit Bharat – 2047.”

He thanked the Prime Minister for GST reforms that provided relief to crores of poor and middle-class families, and for extending continuous support to the state’s development. Lokesh also briefed the Prime Minister on recent developments in Andhra Pradesh.

Responding, PM Modi assured full cooperation for the state’s development. On this occasion, Lokesh presented a coffee table book on Yoga Andhra initiatives to the Prime Minister.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *