
ధాన్యం కొనుగోళ్లపై బహిరంగ చర్చకు వస్తారా..
ఆధారాలతో సహా నిరూపిస్తా…
కొన్నామని చెప్తున్నది ఎంత..? అసలు కొన్నది ఎంత..?
మీరు చెప్పిన కొనుగోలు కేంద్రానికే వెళ్దాం..
రైతులు ఏడుస్తుంటే మీ అనుచరులు డాన్సులు చేస్తారా..?
11 జిల్లాల్లో ఒక్క మెట్రిక్ టన్ను ధాన్యమైనా కొనుగోలు చేశారా..?
ధాన్యం కొనుగోళ్లపై మంత్రి గంగుల కమలాకర్ కు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ సవాల్ విసిరారు ధాన్యం కొనుగోళ్లలో మంత్రి గంగుల కమలాకర్ చెప్తున్నది అవాస్తవాలే అని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా ఐకెపి సెంటర్ల ద్వారా ధాన్యం కొనుగోలుకు సంబంధించి రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అవస్తవాలు చెబుతూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాడునంటూ విమర్శించారు. మంత్రి గంగుల కమలాకర్ రాష్ట్రవ్యాప్తంగా ఐదు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందని చెబుతున్నారు, కానీ రాష్ట్ర ప్రభుత్వ పౌరసరఫరాల శాఖ అధికారిక వెబ్సైట్ వివరాల ప్రకారం తేదీ 27 ఏప్రిల్ 2023 నాటికి రాష్ట్రవ్యాప్తంగా కేవలం 4 లక్షల 81 వేల 44 మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు జరిగిందని, అందులో 11 జిల్లాల్లో ఇప్పటివరకు ఒక్క ధాన్యపు గింజ కొనుగోలు జరగలేదని, ఆరు జిల్లాల్లో 1 మెట్రిక్ టన్నుల లోపు, ఎనిమిది జిల్లాల్లో 2000 మెట్రిక్ టన్నుల లోపు మిగతా ఏడు జిల్లాల్లో నిజామాబాద్ 1 లక్షా 50 వేల 016 మెట్రిక్ టన్నులు, కామారెడ్డి 26,042 మెట్రిక్ టన్నులు, జనగాం 3696 మెట్రిక్ టన్నులు, ఖమ్మం 8198 మెట్రిక్ టన్నులు, నల్గొండ 1,59,040 మెట్రిక్ టన్నులు, సూర్యాపేట 52,702 మెట్రిక్ టన్నులు, వనపర్తి 14,816 మెట్రిక్ టన్నులు, పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్ జిల్లాలో కేవలం 2,267 మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు జరిగిందని స్పష్టమవుతుందిని పొన్నం ధ్వజమెత్తారు. ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలులో జాప్యం చేయడం వలన, ముందస్తుగా తీసుకోవలసిన జాగ్రత్తలు, చేయవలసిన ఏర్పాట్ల విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమవడం వలన అకాల వర్షాలతో రోడ్లపై కుప్పలుగా పోసిన ధాన్యం వర్షం నీటిలో కొట్టుకుపోయి రైతులు లబోదిబోమంటున్నారు, హుజురాబాద్ నియోజకవర్గంలో రోడ్లపై పోసిన వరి ధాన్యం ఇందుకు నిదర్శనం, ఈ పరిస్థితుల్లో రైతులను కదిలిస్తే కన్నీరు పెడుతున్నారు, ఆదుకోవలసిన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నష్టపరిహారం ప్రకటించకపోగా, తడిసిన ధాన్యాన్ని కొనకుండా, తాలు, తరుగు, తేమ పేరుతో కోతలు విధిస్తూ రైతులను ఆవేదనకు గురిచేస్తుందిన్నారు. ఒక కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోనే దాదాపు నాలుగు లక్షల మెట్లు టన్నుల ధాన్యం లభ్యమవుతుండగా మంత్రి ఈ ప్రాంతం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ దాదాపు నెలరోజుల నుండి ధాన్యం కొనుగోలు సెంటర్ల వద్ద అందుబాటులో ఉన్నప్పటికీ కొనుగోలు చేసింది కేవలం 2,267 ధాన్యం మాత్రమే కొనడం మంత్రి పాలనకు నిదర్శనమన్నారు. ఇప్పటికైనా బాధ్యత గల మంత్రి పదవిలో ఉంటూ ధాన్యం కొనుగోలు విషయంలో అవస్తవాలను చెబుతూ అటు రైతులను ఇటు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం మానుకొని, వడగండ్ల వానలతో నష్టపోయిన రైతులకు ఎకరానికి 25 వేల రూపాయల పరిహారం అందించడంతోపాటు, కనీసం మద్దతు ధరతో పాటు తడిసిన ధాన్యం కొనుగోలు చేసి ప్రభుత్వం మరియు పౌరసరఫరాల శాఖ మంత్రి రైతుల పట్ల తమకున్న చిత్తశుద్దిని నిరూపించుకోవాలని ఆయన డిమాండ్ చేసారు.