English News Headline
Stray Dog Attack in Bhuvanagiri Leaves 4-Year-Old Seriously Injured

Full Telugu News Article
భువనగిరి పట్టణంలో ఆడుకుంటున్న చిన్నారులపై వీధి కుక్క దాడి చేయగా, నాలుగేళ్ల బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన తారకరామా నగర్‌లో చోటుచేసుకుంది.
భువనగిరి జిల్లా తారకరామా నగర్‌లో సాయంత్రం ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారులపై ఒక్కసారిగా వీధి కుక్క దాడి చేసింది. ఈ దాడిలో సందెల ప్రియాంష్ అనే నాలుగేళ్ల బాలుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. కుక్క దాడి సమయంలో బాలుడి కనుగుడ్డు బయటికి రావడంతో అతడు తీవ్ర వేదనకు గురయ్యాడు.
బాలుడి పరిస్థితి గమనించిన తల్లిదండ్రులు వెంటనే భువనగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించాలని వైద్యులు సూచించారు. దీంతో బాలుడిని యశోద ఆస్పత్రికి తరలించారు.
ఈ ఘటనలో మరో చిన్నారికి కూడా గాయాలు కాగా, అతడికి భువనగిరి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఇదే సమయంలో ఆర్‌బీ నగర్‌లో కూడా మరో ఇద్దరు చిన్నారులపై వీధి కుక్కలు దాడి చేయడం ఆందోళన కలిగిస్తోంది.
పట్టణంలో వరుసగా వీధి కుక్కల దాడులు పెరగడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ ఘటనపై ఆగ్రహంతో ప్రజలు ప్రభుత్వ ఆస్పత్రి ముందు ఆందోళన చేపట్టి, అధికారుల తక్షణ చర్యలను డిమాండ్ చేశారు.
Full English News Article
A four-year-old boy was seriously injured after a stray dog attack on children playing outside in Bhuvanagiri town. The incident occurred in Tarakarama Nagar, raising concerns among residents.
According to local reports, children were playing in front of their houses when a stray dog suddenly attacked them. In the attack, a boy identified as Priyansh sustained severe injuries, including serious damage to his eye, causing immense pain.
Family members immediately rushed the child to the Bhuvanagiri Government Hospital. After initial treatment, doctors advised shifting him to Hyderabad for advanced care due to the severity of his condition. He was later taken to Yashoda Hospital for further treatment.
Another child injured in the same incident is currently receiving treatment at the local hospital. In a separate but similar incident in RB Nagar, two more children were reportedly attacked and injured by stray dogs.
The repeated incidents of stray dog attacks in Bhuvanagiri have created panic among residents. Locals staged a protest in front of the government hospital, demanding immediate action from authorities to control the stray dog menace.